బాక్స్ ఆఫీస్ దగ్గర లాస్ట్ ఇయర్ టిల్లు స్క్వేర్ తో మాస్ హిట్ ను సొంతం చేసుకున్న సిద్ధూ జొన్నలగడ్డ(Siddhu Jonnalagadda) నటించిన లేటెస్ట్ మూవీ జాక్(Jack Movie) తో మరో సారి రచ్చ చేయాలని చూసినా కూడా మొదటి ఆటకే మిక్సుడ్ టాక్ ను సొంతం చేసుకున్న సినిమా కలెక్షన్స్ పరంగా కూడా…
మొదటి రోజు పెద్దగా ఇంపాక్ట్ ని ఏమి చూపించ లేక పోయింది. ఇక రెండో రోజులో అడుగు పెట్టిన సినిమా తెలుగు రాష్ట్రాల్లో డ్రాప్స్ ను గట్టిగానే సొంతం చేసుకోగా కలెక్షన్స్ పరంగా సినిమా ఈ రోజు సాలిడ్ గ్రోత్ ని చూపించాల్సిన చోట డ్రాప్స్ ను సొంతం చేసుకుంటూ ఉండగా…
మొత్తం మీద ట్రాక్ చేసిన సెంటర్స్ ను సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు అటూ ఇటూగా 60-70 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉండగా, ఫైనల్ ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలను బట్టి కలెక్షన్స్ కొంచం పెరిగే అవకాశం కొద్ది వరకు ఉంది.
ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర వరల్డ్ వైడ్ గా కూడా పెద్దగా ఇంపాక్ట్ ఏమి చూపించలేక పోతూ ఉండటంతో 80-85 లక్షల రేంజ్ లో షేర్ ని వరల్డ్ వైడ్ గా అందుకునే అవకాశం ఉండగా, ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలను బట్టి కలెక్షన్స్ కొంచం పెరిగే అవకాశం ఉంది..
కానీ సినిమా అందుకోవాల్సిన టార్గెట్ దృశ్యా ఇంకా సాలిడ్ గా హోల్డ్ ని చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి సినిమా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కల్లో ఏమైనా జోరు చూపించి ఈ అంచనాలను ఏమైనా మించుతుందో లేక ఇదే రేంజ్ లో కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి.