Home న్యూస్ 2nd DAY కల్కి కలెక్షన్స్….రెబల్ స్టార్ మాస్ రాంపెజ్!!

2nd DAY కల్కి కలెక్షన్స్….రెబల్ స్టార్ మాస్ రాంపెజ్!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు ఓవరాల్ గా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన లేటెస్ట్ మూవీ కల్కి 2898 AD(Kalki 2898AD Movie) ఎక్స్ లెంట్ స్టార్ట్ ను సొంతం చేసుకున్న తర్వాత రెండో రోజులో ఇప్పుడు అడుగు పెట్టింది…తెలుగు రాష్ట్రాల్లో రెండో రోజు సినిమా ఇప్పుడు ఎలాంటి హోల్డ్ ని చూపించింది అన్నది ఆసక్తిగా మారగా….

నైజాంలో సినిమా రెండో రోజు మంచి జోరునే చూపిస్తూ దూసుకు పోతుంది… ఓవరాల్ గా మొదటి రోజుతో పోల్చితే డ్రాప్స్ మిగిలిన సినిమాల మాదిరిగానే ఉన్నప్పటికీ కూడా రెండో రోజు నార్మల్ వర్కింగ్ డే అవ్వడంతో ఉన్నంతలో సినిమా మంచి హోల్డ్ ని చూపెడుతూ ఉండగా నైజాంలో డే 2 బాగా హోల్డ్ చేసింది ఇప్పుడు… ఇక సీడెడ్ లో కొంచం డ్రాప్స్ ఎక్కువగా ఉండగా…

ఆంధ్రలో పర్వాలేదు అనిపించే రేంజ్ లో జోరు చూపిస్తూ ఉండగా మొత్తం మీద రెండో రోజు ట్రాక్ చేసిన సెంటర్స్ ను బట్టి చూస్తూ ఉంటే 16-18 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉందని చెప్పాలి ఇప్పుడు. ఇక సినిమా హిందీలో రెండో రోజు మంచి హోల్డ్ ని చూపెడుతూ దూసుకు పోతూ ఉండగా 18-20కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ మార్క్ ని అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా….

కర్ణాటక లో మరోసారి మంచి హోల్డ్ ని చూపెడుతున్న సినిమా తమిళ్, కేరళలో కూడా రెండో రోజు బాగానే హోల్డ్ ని చూపెడుతుంది. దాంతో ఈ చోట్లలో రెండో రోజు సినిమా 5 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉండగా ఓవర్సీస్ లో రెండో రోజు కూడా స్ట్రాంగ్ హోల్డ్ ని చూపెడుతూ 10 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా…

రెండో రోజు సినిమా వరల్డ్ వైడ్ గా 40-42కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉంది. రెండో రోజు ఫుల్ వర్కింగ్ డే లో ఈ రేంజ్ లో షేర్ వస్తే అది సాలిడ్ హోల్డ్ అనే చెప్పాలి. అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలను బట్టి కలెక్షన్స్ కొంచం అటూ ఇటూగా ఉండే అవకాశం ఉంది. ఇక 2 రోజుల అఫీషియల్ కలెక్షన్స్ లెక్కలు ఎలా ఉంటాయో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here