మొదటి రోజు ఊహకందని కలెక్షన్స్ తో ఊచకోత కోస్తూ కొత్త రికార్డులను నమోదు చేస్తుంది అన్న నమ్మకం ఉన్న మూవీగా అనిపించిన కోలివుడ్ స్టార్ హీరో సూర్య(Suriya) నటించిన లేటెస్ట్ మూవీ కంగువ(Kanguva Movie 2nd Day Collections) ఏమాత్రం జోరుని బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజున చూపించ లేక పోయింది…
ఓ రేంజ్ లో అంచనాలు పెట్టుకున్నా జస్ట్ సూర్య కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ తో సరిపెట్టిన సినిమాకి మిక్సుడ్ రెస్పాన్స్ గట్టి ఎదురుదెబ్బే తీసింది….ఇక రెండో రోజులో అడుగు పెట్టిన సినిమా మొదటి రోజు బుకింగ్స్ తో పోల్చితే ఆల్ మోస్ట్ 60-65% రేంజ్ లో ఆన్ లైన్ టికెట్ సేల్స్ లో…
డ్రాప్స్ కనిపిస్తూ ఉండగా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లో కూడా ఈ ఇంపాక్ట్ కనిపిస్తూ ఉండగా మొత్తం మీద సినిమా ప్రజెంట్ ట్రెండ్ ను బట్టి చూస్తూ ఉంటే తెలుగు రాష్ట్రాల్లో రెండో రోజున అటూ ఇటూగా 1.2-1.4 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా…
ఆఫ్ లైన్ లెక్కలు బాగుంటే కలెక్షన్స్ లెక్క మరికొంత పెరిగే అవకాశం కూడా ఉందని చెప్పాలి ఇప్పుడు… ఇక తమిళనాడులో సినిమా ఈ రోజు అటూ ఇటూగా 3-4 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకునే అవకాశం ఉండగా రెస్ట్ ఆఫ్ ఇండియాలో ఓవరాల్ గా…
5 కోట్ల రేంజ్ దాకా గ్రాస్ ను అందుకునే అవకాశం కనిపుస్తుంది. ఇక ఓవర్సీస్ కలెక్షన్స్ లో కూడా డ్రాప్స్ ఉండటంతో రెండో రోజు ఓవరాల్ గా వరల్డ్ వైడ్ కలెక్షన్స్ లెక్క 14-16 కోట్ల మధ్యలో ఉండే అవకాశం ఉంది, అది కూడా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటేనే…
సాధ్యం అని చెప్పాలి. కానీ సినిమా అందుకోవాల్సిన మమ్మోత్ టార్గెట్ దృశ్యా ఈ కలెక్షన్స్ అసలు టార్గెట్ దరిదాపుల్లోకి వెళ్ళడానికి కూడా సరిపోవు అనే చెప్పాలి. సినిమా ఊహకందని రేంజ్ లో జోరు చూపించాల్సిన చోట అనుకున్న దాని కన్నా ఎక్కువగానే డ్రాప్స్ ను సొంతం చేసుకుంటుంది. ఇక 2 రోజుల అఫీషియల్ కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.