బాక్స్ ఆఫీస్ దగ్గర లైగర్ సినిమా కలెక్షన్స్ ఇప్పుడు టోటల్ ట్రేడ్ తో పాటు డిస్ట్రిబ్యూటర్లకి థియేటర్ ఓనర్స్ కి వణుకు పుట్టిస్తుంది అని చెప్పాలి. సినిమా పై విపరీతమైన హైప్ ను బిల్డ్ చేసిన టీం అండ్ హీరో సినిమా భారీ బిజినెస్ కి కారణం అయ్యారు, యూత్ లో భారీ క్రేజ్ ను సొంతం చేసుకున్న లైగర్ ని భారీ రేట్లకి ఎగబడి కొన్నారు అన్ని సెంటర్స్ లో కూడా…
తీరా ఇప్పుడు రిలీజ్ అయ్యాక మొదటి రోజు అనుకున్న అంచనాలను అందుకోలేక పోయిన లైగర్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర 90 కోట్ల షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉండగా రెండో రోజు సినిమా ఆల్ మోస్ట్ 70% రేంజ్ లో డ్రాప్స్ ను అన్ని సెంటర్స్ లో సొంతం చేసుకోగా…
ఈవినింగ్ అండ్ నైట్ షోలలో కూడా మరీ అద్బుతం అనిపించేలా ఎక్కడా కూడా గ్రోత్ ని చూపించలేక పోయింది. దాంతో ఇప్పుడు సినిమా అటూ ఇటూగా 2.5 కోట్ల రేంజ్ లోనే షేర్ ని తెలుగు రాష్ట్రాల్లో అందుకునే అవకాశం ఉంది, అది కూడా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటేనే…
ఇక వరల్డ్ వైడ్ గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 4.5 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకునే అవకాశం ఉండగా ఫైనల్ ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు, హిందీలో ఓవరాల్ రీచ్ మరింత బెటర్ గా ఉంటె 5 కోట్ల రేంజ్ దాకా షేర్ ని సినిమా రెండో రోజు అందుకునే అవకాశం ఉందని చెప్పాలి. కానీ సినిమా అందుకోవాల్సిన టార్గెట్ దృశ్యా…
ఈ కలెక్షన్స్ 90 కోట్ల బ్రేక్ ఈవెన్ లో సగం టార్గెట్ ను అందుకోవడానికి కూడా దరిదాపుల్లోకి వెళ్ళలేని పరిస్థితి ఉంది. దాంతో సినిమా బిజినెస్ లో భాగం అయిన వారందరికీ వెన్నులో వణుకు పుట్టించేలా రెండో రోజు సినిమా బాక్స్ ఆఫీస్ స్టేటస్ ఉందని చెప్పాలి. మరి సినిమా ఈ వీకెండ్ లో ఏదైనా అద్బుతం చేస్తుందో లేదో చూడాలి.