సెన్సేషనల్ ఓపెనింగ్స్ తో మాస్ రచ్చ చేసిన మ్యాడ్(Mad Movie) కి సీక్వెల్ గా వచ్చిన మ్యాడ్ స్క్వేర్(Mad Square Movie) తో ముగ్గురు హీరోలు అన్ని చోట్లా సెన్సేషనల్ స్టార్ట్ ను సొంతం చేసుకోగా మొదటి రోజు అంచనాలను అన్నీ మించి పోయే ఓపెనింగ్స్ ను సొంతం చేసుకోగా బిజినెస్ లో ఆల్ మోస్ట్ సగం వరకు రికవరీ చేయగా సినిమా…
రెండో రోజున అన్ని చోట్లా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దూసుకు పోతూ ఉండగా మార్నింగ్ అండ్ మ్యాట్నీ షోలకి కొంచం డ్రాప్స్ ను సొంతం చేసుకున్న సినిమా ఈవినింగ్ షోల నుండి మళ్ళీ జోరు చూపెడుతున్న సినిమా మూడో రోజు మరింత జోరు చూపించే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి…
మొత్తం మీద ఈవినింగ్ అండ్ నైట్ షోల ట్రెండ్ ను చూస్తూ ఉంటే సినిమా రెండో రోజున 4 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకునే అవకాశం ఉన్న సినిమా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే షేర్ లెక్క ఇంకా పెరిగే అవకాశం ఎంతైనా ఉంది… ఇక సినిమా కర్ణాటక అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో..
అలాగే ఓవర్సీస్ లో కూడా మరోసారి ఎక్స్ లెంట్ గా జోరు చూపెడుతూ ఉండటంతో రెండో రోజు వరల్డ్ వైడ్ గా 5 కోట్ల రేంజ్ నుండి 5.5 కోట్ల రేంజ్ లో షేర్ మార్క్ ని సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలను బట్టి కలెక్షన్స్ లెక్కలు కొంచం అటూ ఇటూగా ఉండొచ్చు..
మొత్తం మీద మ్యాడ్ కుర్రాళ్ళు వీకెండ్ లో రిలీజ్ అయిన అన్ని సినిమాలను తెలుగు రాష్ట్రాల్లో ఫుల్లుగా డామినేట్ చేస్తూ మాస్ రచ్చ చేస్తూ ఉండగా వీకెండ్ లోనే ఇప్పుడు బ్రేక్ ఈవెన్ ని దాటేసి మంచి లాభాలను అందుకునే అవకాశం ఉంది. ఇక టోటల్ గా సినిమా 2 రోజుల్లో సాధించే కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.