మొదటి రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర అంచనాలను అన్నీ కూడా మించి పోయే రేంజ్ కలెక్షన్స్ తో ఊహకందని ఊచకోత కోసిన మ్యాడ్(Mad Movie) కి సీక్వెల్ గా వచ్చిన మ్యాడ్ స్క్వేర్(Mad Square Movie) బిజినెస్ లో ఆల్ మోస్ట్ సగం టార్గెట్ ను రికవరీ చేసి సంచలనం సృష్టించగా ఈ వీక్ లో రిలీజ్ అయిన మూవీస్ అన్నింటినీ కూడా ఓ రేంజ్ లో డామినేట్ చేస్తూ ఉన్న సినిమా…
రెండో రోజులో ఎంటర్ అవ్వగా మిగిలిన సినిమాలు తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా ఇంపాక్ట్ ఏమి చూపించలేకపోతూ ఉండటంతో మ్యాడ్2 మూవీ మాస్ రాంపెజ్ కొనసాగుతూ ఉండగా మొదటి రోజుతో పోల్చితే డ్రాప్స్ చాలా లిమిటెడ్ గానే ఉండగా రెండో రోజు కూడా సినిమా ఇప్పుడు…
బాక్స్ ఆఫీస్ దగ్గర ఎక్స్ లెంట్ రాంపెజ్ ను చూపించబోతుంది….ఈవినింగ్ అండ్ నైట్ షోలకు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మరింతగా జోరు చూపించే అవకాశం ఉండగా మొత్తం మీద ట్రాక్ చేసిన సెంటర్స్ ను బట్టి చూస్తూ ఉంటే రెండో రోజు తెలుగు రాష్ట్రాల్లో 3.5-3.8 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకునే…
అవకాశం ఉండగా, ఈవినింగ్ అండ్ నైట్ షోల ట్రెండ్ సాలిడ్ గా ఉంటే సినిమా 4 కోట్లు ఆ పైన షేర్ ని అందుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు. ఇక అమెరికాలో 1 మిలియన్ మార్క్ వైపు దూసుకు పోతున్న సినిమా మిగిలిన చోట్ల కూడా సాలిడ్ ట్రెండ్ ను చూపెడుతూ ఉండగా…
రెండో రోజు కొంచం డ్రాప్ అయినా సండే అలాగే మండే రోజున సాలిడ్ గా జోరు చూపించే అవకాశం సినిమా కి ఎంతైనా ఉండగా సినిమా ఓవరాల్ గా బ్రేక్ ఈవెన్ ని కూడా దాటేసి సాలిడ్ లాభాలను సొంతం చేసుకునే అవకాశం ఉంది. ఇక సినిమా డే 2 ఎండ్ అయ్యే టైంకి ఎంతవరకు జోరు చూపెడుతుందో చూడాలి ఇక….