బాక్స్ ఆఫీస్ దగ్గర సందీప్ కిషన్(Sundeep Kishan) నటించిన లేటెస్ట్ మూవీ మజాకా(Mazaka Movie)సినిమా రీసెంట్ గా రిలీజ్ అయ్యి సందీప్ కిషన్ కెరీర్ లో సెకెండ్ హైయెస్ట్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుంది. మొదటి రోజు 2.15 కోట్ల రేంజ్ లో గ్రాస్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకున్న మజాకా మూవీ…
రెండో రోజు వర్కింగ్ డే అవ్వడంతో సినిమా డ్రాప్స్ ను సొంతం చేసుకోగా మొదటి రోజుతో పోల్చితే రెండో రోజు ఆల్ మోస్ట్ 50% రేంజ్ లో టికెట్ సేల్స్ లో డ్రాప్స్ కనిపిస్తూ ఉండగా ఈవినింగ్ అండ్ నైట్ షోల ట్రెండ్ బాగుంటే ఆక్యుపెన్సీ కొంచం పెరిగే అవకాశం ఉందని చెప్పాలి.
ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రజెంట్ ట్రెండ్ ను బట్టి చూస్తూ ఉంటే ఓవరాల్ గా 2వ రోజున 1 కోటి నుండి 1.1 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఉండగా, ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలు కనుక బాగుంటే 1.2 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకునే అవకాశం ఉండగా…
కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా మరియు ఓవర్సీస్ లో కూడా కొంచం డ్రాప్స్ ను సొంతం చేసుకున్న సినిమా ఓవరాల్ గా సినిమా 2వ రోజున వరల్డ్ వైడ్ గా 1.5 కోట్ల రేంజ్ కి అటూ ఇటూగా గ్రాస్ ను ఈ రోజు సినిమా సొంతం చేసుకునే అవకాశం ఉండగా…
ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలు బాగుంటే కలెక్షన్స్ కొంచం పెరగవచ్చు, కానీ సినిమా అందుకోవాల్సిన టార్గెట్ దృశ్యా ఇంకా జోరు పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా 2 రోజులకు గాను సాధించే అఫీషియల్ కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.