మొదటి పార్ట్ ఓటిటి లో మంచి వ్యూవర్ షిప్ తో సూపర్ సక్సెస్ అయిన తర్వాత సంపత్ నంది డైరెక్షన్ లో తమన్నా(Tamannaah Bhatia) మెయిన్ లీడ్ లో రూపొందిన ఓడెల2(Odela2 Movie) సినిమా సీక్వెల్ ఫ్యాక్టర్ తో ట్రైలర్ బాగానే క్లిక్ అవ్వడంతో మంచి ఓపెనింగ్స్ తో సినిమా కుమ్మేస్తుంది అనుకున్నా కూడా మూవీ…
మొదటి రోజు పెద్దగా ఇంపాక్ట్ ని అయితే చూపించ లేక పోయింది… 1.15 కోట్ల రేంజ్ లోనే గ్రాస్ మార్క్ ని సొంతం చేసుకున్న సినిమా రెండో రోజున కొత్త సినిమాల నుండి పోటి ఉన్నప్పటికీ హాలిడే అడ్వాంటేజ్ కూడా ఉండటంతో..
ఆన్ లైన్ టికెట్ సేల్స్ లో పర్వాలేదు అనిపించేలా ట్రెండ్ ను అయితే చూపెడుతూ ఉన్నప్పటికీ కూడా ఓవరాల్ గా అందుకోవాల్సిన టార్గెట్ దృశ్యా ఇంకా జోరు ని చూపించాల్సిన అవసరం అయతే ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు…మొత్తం మీద ప్రజెంట్ ట్రెండ్ ను బట్టి..
చూస్తూ ఉంటే బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు కి లిమిటెడ్ డ్రాప్స్ తో రెండో రోజుని కొనసాగిస్తున్న సినిమా ఓవరాల్ గా రెండో రోజు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఓవరాల్ గా 70-80 లక్షల రేంజ్ లో గ్రాస్ ను అందుకునే అవకాశం ఉండగా, ఫైనల్ ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు..
బాగుంటే కలెక్షన్స్ ఇంకొంచం పెరిగే అవకాశం ఉంది. ఇక రెస్ట్ ఆఫ్ ఇండియా మరియు ఓవర్సీస్ లో సినిమా పర్వాలేదు అనిపించేలా ట్రెండ్ ఉండగా వరల్డ్ వైడ్ గా సినిమా రెండో రోజున 1 కోటి నుండి 1.1 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకునే అవకాశం ఉంది. ఇక టోటల్ గా 2 రోజుల్లో సినిమా సాధించే అఫీషియల్ కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.