బాక్స్ ఆఫీస్ దగ్గర మాస్ మహారాజ్ రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ రావణాసుర మొదటి రోజు ఉన్నంతలో మంచి కలెక్షన్స్ నే సొంతం చేసుకుని అంచనాలను మించిపోయింది, కమర్షియల్ మూవీ కాకున్నా కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా జోరు చూపించడం విశేషం అనే చెప్పాలి. ఇక సినిమా రెండో రోజులో అడుగు పెట్టగా బాక్స్ ఆఫీస్ దగ్గర రెండో రోజు సినిమా నైజాంలో మంచి హోల్డ్ నే చూపిస్తూ ఉండగా…
మిగిలిన చోట్ల మాత్రం కొంచం ఎక్కువగానే డ్రాప్స్ ను సొంతం చేసుకుంది. మొత్తం మీద ట్రాక్ చేసిన సెంటర్స్ లో మొదటి రోజుతో పోల్చితే సినిమా రెండో రోజు 40% రేంజ్ లో డ్రాప్స్ ను సొంతం చేసుకుంది. ఇది నార్మల్ డ్రాప్ అనే చెప్పాలి. దాంతో సినిమా ఇప్పుడు…
బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు రాష్ట్రాలలో అటూ ఇటూగా 2 కోట్ల రేంజ్ నుండి 2.2 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉందని చెప్పాలి. కానీ సినిమా అందుకోవాల్సిన బ్రేక్ ఈవెన్ టార్గెట్ దృశ్యా సినిమా ఓవరాల్ గా 2.5 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుంటే…
బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి హోల్డ్ ని చూపించింది అని చెప్పొచ్చు. మరి సినిమా డే 2 ఎండ్ అయ్యే టైం కి ఈ మార్క్ ని అందుకునే అవకాశం ఉంటుందో ఉండదో చూడాలి. ఓవరాల్ గా సినిమా డే 2 ఎండ్ అయ్యే టైంకి బాక్స్ ఆఫీస్ దగ్గర ఎంతవరకు కలెక్షన్స్ ని సాధించవచ్చు అన్నది అప్ డేట్ చేస్తాం.