బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు బాక్ టు బాక్ ఫ్లాఫ్స్ తర్వాత కెరీర్ లో బిగ్గెస్ట్ కంబ్యాక్ ను సొంతం చేసుకున్న యువ సామ్రాట్ అక్కి నేని నాగ చైతన్య(Naga Chaitanya) నటించిన లేటెస్ట్ మూవీ తండేల్(Thandel Movie) సినిమాతో మాస్ ఊచకోత కోయగా, రెండో రోజు కూడా ఈ సినిమా రికార్డులతో విరుచుకుపడి మాస్ రచ్చ చేసింది…అన్ని చోట్లా సినిమా…
అనుకున్న అంచనాలను అన్నీ కూడా మించి పోయి మాస్ ఊచకోత కోసింది. 6-6.5 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవడం ఖాయమని అనుకున్నా కూడా ఓవరాల్ గా అన్ని అంచనాలను మించి పోయిన సినిమా ఏకంగా 7 కోట్ల మార్క్ ని కూడా దాటేసి 7.42 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని…
ఊహకందని రేంజ్ లో ఊచకోత కోసింది, రెండో రోజు టాలీవుడ్ లో మీడియం రేంజ్ మూవీస్ లో టాప్ 10 లో ఒకటిగా నిలవడం అయితే ఖాయమని అనుకున్నా కూడా ఏకంగా అంచనాలను మించి పోయి మీడియం రేంజ్ మూవీస్ లో ఎపిక్ డే 2 రికార్డ్ ను నమోదు చేసి సంచలనం సృష్టించింది…
ఒకసారి డే 2 టాలీవుడ్ లో మీడియం రేంజ్ మూవీస్ లో ఆల్ టైం హైయెస్ట్ కలెక్షన్స్ ని అందుకున్న సినిమాలను గమనిస్తే…
Day 2 AP-TG Top collections for Medium Range Movies
👉#Thandel – 7.42Cr********
👉#TilluSquare – 7.36Cr
👉#Uppena- 6.86Cr
👉#DASARA – 5.86CR
👉#VIRUPAKSHA – 5.80CR
👉#Kushi- 5.36Cr
👉#LoveStory- 5.08Cr
👉#Majili: 4.98Cr
👉#MostEligibleBachelor- 4.54Cr
👉#Bimbisara- 4.52CR
👉#ShyamSinghaRoy- 4.38Cr
👉#HanuMan – 4.36Cr
👉#iSmartShankar: 4.32C
ఓవరాల్ గా ప్రీవియస్ గా లాస్ట్ ఇయర్ వచ్చిన టిల్లు స్క్వేర్ మూవీ డే 2 రికార్డ్ ను నమోదు చేయగా ఇప్పుడు ఆ రికార్డ్ ను కొద్ది మార్జిన్ తో బ్రేక్ చేసిన తండేల్ మూవీ ఓవరాల్ గా అప్ కమింగ్ మీడియం రేంజ్ హీరోల సినిమాలకు మంచి టార్గెట్ ను సెట్ చేసి పెట్టింది. ఇక లాంగ్ రన్ లో సినిమా ఎలాంటి వసూళ్ళని అందుకుంటుందో చూడాలి.