బాక్స్ ఆఫీస్ దగ్గర సూర్య(Suriya) నటించిన లేటెస్ట్ మూవీ రెట్రో(Retro Movie)సినిమా రీసెంట్ గా రిలీజ్ అయ్యి మిక్సుడ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకోగా మొదటి రోజున బాగానే జోరు చూపించింది….తమిళనాడులో సినిమా సూర్య కెరీర్ లోనే ఆల్ టైం బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుని మాస్ రచ్చ చేసింది… ఇక తెలుగు రాష్ట్రాల్లో మాత్రం సినిమా…
హిట్3 వలన అనుకున్న రేంజ్ లో ఇంపాక్ట్ చూపలేదు కానీ పర్వాలేదు అనిపించేలా హోల్డ్ చేయగా ఇంకా స్ట్రాంగ్ హోల్డ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి. ఇక రెండో రోజు సినిమా ఆల్ మోస్ట్ ట్రాక్ చేసిన సెంటర్స్ లో ఆల్ మోస్ట్ 70% రేంజ్ లో డ్రాప్స్ ను తెలుగు రాష్ట్రాల్లో సొంతం చేసుకోగా..
తమిళనాడు లో ఆల్ మోస్ట్ రెండో రోజు 65% రేంజ్ లో డ్రాప్స్ ను సొంతం చేసుకుంటూ ఉండగా ఓవరాల్ గా రెండో రోజున తెలుగు రాష్ట్రాల్లో ప్రజెంట్ ట్రెండ్ ను బట్టి చూస్తుంటే 60-70 లక్షల రేంజ్ లో గ్రాస్ ను అందుకునే అవకాశం ఉండగా ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలు బాగుంటే…
కలెక్షన్స్ కొంచం పెరిగే అవకాశం ఉంది..ఇక తమిళనాడులో సినిమా రెండో రోజు ప్రజెంట్ ట్రెండ్ ను బట్టి చూస్తుంటే 6 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకునే అవకాశం ఉండగా ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలు బాగుంటే 6.5-7 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి…
ఇక రెస్ట్ ఆఫ్ ఇండియా మరియు ఓవర్సీస్ లో కూడా ఈ రోజు హెవీగానే డ్రాప్స్ ను సొంతం చేసుకున్న వరల్డ్ వైడ్ గా రెండో రోజున 11-12 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకునే అవకాశం ఉంది, ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలు బాగుంటే గ్రాస్ లెక్క మరికొంత పెరగవచ్చు కానీ…
సినిమా అందుకోవాల్సిన టార్గెట్ దృశ్యా ఇంకా సాలిడ్ ట్రెండ్ ను హోల్డ్ ని చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది… ఇక రెండో రోజు సినిమా వరల్డ్ వైడ్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర ఓవరాల్ గా ఇదే రేంజ్ లో వసూళ్ళని అందుకుంటుందో లేక ఇంతకుమించి ఏమైనా గ్రోత్ ని చూపిస్తుందో చూడాలి.