యూత్ స్టార్ నితిన్(Nithiin) నటించిన లేటెస్ట్ మూవీ రాబిన్ హుడ్(RobinHood Movie) సినిమా ఆడియన్స్ ముందుకు రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమా కి ఆడియన్స్ నుండి మిక్సుడ్ రెస్పాన్స్ సొంతం అవ్వగా ఓపెనింగ్స్ పరంగా ఇతర సినిమాల పోటి వలన ఏమాత్రం ఇంపాక్ట్ ను చూపించలేక పోయిన సినిమా తీవ్రంగా నిరాశ పరిచే స్టార్ట్ ను సొంతం చేసుకోగా…
సినిమా కి పెట్టిన బడ్జెట్ అండ్ బిజినెస్ దృశ్యా మినిమమ్ లో మినిమమ్ ఇంపాక్ట్ చూపించలేదు…ఇక రెండో రోజులో అడుగు పెట్టిన సినిమా కొన్ని చోట్ల పర్వాలేదు అనిపించేలా హోల్డ్ చేస్తూ ఉండగా ఓవరాల్ గా సినిమా అందుకోవాల్సిన టార్గెట్ దృశ్యా మాత్రం ఇంకా సాలిడ్ గా ట్రెండ్ ను….
చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి. మొత్తం మీద ట్రాక్ చేసిన సెంటర్స్ ను బట్టి చూస్తూ ఉంటే ఓవరాల్ గా రెండో రోజు తెలుగు రాష్ట్రాల్లో ఆఫ్ లైన్ లెక్కలు బాగుంటే 80 లక్షల రేంజ్ నుండి కోటి రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉంది…ఒకవేళ ఆఫ్ లైన్ లెక్కలు….
అంచనాలను అందుకోకపొతే మాత్రం కలెక్షన్స్ ఇంకా తగ్గే అవకాశం ఉంది. ఇక వరల్డ్ వైడ్ గా కూడా పెద్దగా ఇంపాక్ట్ ను చూపించలేక పోయిన సినిమా ఓవరాల్ గా రెండో రోజున 1-1.2 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉందని చెప్పాలి…
మొత్తం మీద సినిమా కి వచ్చిన మిక్సుడ్ టాక్ దృశ్యా పర్వాలేదు అనిపించేలా హోల్డ్ చేసినా కూడా సినిమా అందుకోవాల్సిన టార్గెట్ దృశ్యా చూసుకుంటే మాత్రం ఈ లెక్క ఏమాత్రం సరిపోదు అనే చెప్పాలి. సినిమా ఇంతకుమించిన జోరు చూపించాల్సిన అవసరం ఉంది. ఇక టోటల్ గా 2 రోజుల్లో సినిమా సాధించే కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.