Home న్యూస్ 2nd డే సింగిల్ ఓపెనింగ్స్…మాస్ కుమ్ముడు కుమ్ముతుందిగా!!

2nd డే సింగిల్ ఓపెనింగ్స్…మాస్ కుమ్ముడు కుమ్ముతుందిగా!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర యంగ్ హీరో శ్రీ విష్ణు(Sree Vishnu) నటించిన కొత్త సినిమా సింగిల్(Single Movie) మూవీ రీసెంట్ గా రిలీజ్ అయ్యి ఎక్స్ లెంట్ ఓపెనింగ్స్ ను మొదటి రోజున సొంతం చేసుకుంది. సినిమా డే 1 బాక్స్ ఆఫీస్ దగ్గర అనుకున్న అంచనాలను అన్నీ కూడా మించి పోయే రేంజ్ లో కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది సినిమా..

సినిమా వరల్డ్ వైడ్ గా 4 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ మార్క్ ని అందుకుని వీర లెవల్ లో కుమ్మేసింది. ఇక రెండో రోజులో అడుగు పెట్టిన సినిమా ఎక్స్ లెంట్ ట్రెండ్ ను చూపెడుతూ ఉండగా అన్ని చోట్లా బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజుకి ఏమాత్రం తీసిపోని రేంజ్ లో…

ట్రెండ్ ను చూపెడుతూ దూసుకు పోతున్న సినిమా ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాలతో పాటు వరల్డ్ వైడ్ గా కూడా ఎక్స్ లెంట్ ట్రెండ్ ను చూపెడుతున్న సినిమా ఈవినింగ్ అండ్ నైట్ షోలకు కూడా సాలిడ్ గా జోరుని చూపించే అవకాశం ఎంతైనా ఉండగా…

Sree Vishnu Single Movie 1st Day Total WW Collections!!

ఓవరాల్ గా ప్రజెంట్ ఓపెనింగ్స్ ను బట్టి చూస్తూ ఉంటే సినిమా రెండో రోజున తెలుగు రాష్ట్రాల్లో 1.4 కోట్ల రేంజ్ లో షేర్ ని మరోసారి అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా, ఫైనల్ ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు కనుక బాగుంటే ఈ లెక్క మరింత పెరిగే అవకాశం ఉంది.

ఇక ఈవినింగ్ అండ్ నైట్ షోలకు సాలిడ్ ట్రెండ్ ను చూపించి జోరుని మరింతగా పెంచితే ఈ లెక్క 1.5-1.7 కోట్ల రేంజ్ కి వెళ్ళే అవకాశం ఉండగా, కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా మరియు ఓవర్సీస్ లో మంచి ట్రెండ్ ను చూపెడుతున్న సినిమా వరల్డ్ వైడ్ గా కూడా..

ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని ఈ రోజున సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు… ఇక సినిమా వీకెండ్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్ ని అందుకునే అవకాశం ఉండగా లాంగ్ రన్ లో మంచి లాభాలను సొంతం చేసుకునే అవకాశం ఉంది. ఇక డే 2 ఎండ్ అయ్యే టైంకి ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here