మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో అంచనాలను మించి ఎక్స్ లెంట్ ఓపెనింగ్స్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపిన ధనుష్ నటించిన లేటెస్ట్ మూవీ సార్ రెండో రోజు మహా శివరాత్రి హాలిడే అడ్వాంటేజ్ ను ఎంజాయ్ చేస్తుంది, కొత్త సినిమాల కోసం కొన్ని థియేటర్స్ ని కోల్పోయినా ఉన్న థియేటర్స్ లోనే ఎక్స్ లెంట్ ఆక్యుపెన్సీతో రెండో రోజు కూడా దుమ్ము లేపుతున్న సార్ మూవీ ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర…
రెండో రోజు మొత్తం మీద ట్రాక్ చేసిన సెంటర్స్ ని బట్టి చూస్తూ ఉంటే 2.3-2.5 కోట్ల షేర్ ని మరోసారి సొంతం చేసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలను బట్టి ఈ కలెక్షన్స్ ఇంకా పెరిగే అవకాశం కూడా ఉంది.
ఇక సినిమా తమిళ్ లో మొదటి రోజు కన్నా రెండో రోజు బుకింగ్స్ ఎక్కువగా ఉండటంతో రెండో రోజు గ్రోత్ ఉండటం ఖాయంగా ఉండగా మొత్తం మీద రెండో రోజు వరల్డ్ వైడ్ గా సినిమా 15 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని అందుకునే అవకాశం కనిపిస్తూ ఉంది…
ఫైనల్ లెక్కలను బట్టి ఈ కలెక్షన్స్ ఇంకా పెరిగే అవకాశం కూడా ఉంది, ఓవరాల్ గా తెలుగులో సినిమా రిమార్కబుల్ హోల్డ్ ని రెండో రోజు కూడా చూపించగా వీకెండ్ పూర్తీ అయ్యే టైంకే బ్రేక్ ఈవెన్ ని అందుకోవడం ఖాయంగా కనిపిస్తుంది. ఇక 2 రోజుల టోటల్ కలెక్షన్స్ ఏ విధంగా ఉంటాయో చూడాలి.