బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ వీకెండ్ లో డీసెంట్ అంచనాల నడుమ రిలీజ్ అయిన యూత్ స్టార్ నితిన్(Nithiin) ఒకరు కాగా రీసెంట్ గా నితిన్ నటించిన తమ్ముడు(Thammudu Movie) మొదటి రోజు కలెక్షన్స్ పరంగా ఏమాత్రం హోల్డ్ ని అయితే చూపించ లేక పోయింది. రీసెంట్ టైంలోనే నితిన్ కెరీర్ లోనే వన్ ఆఫ్ ది…
లోవేస్ట్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకున్న సినిమా రెండో రోజులో ఎంటర్ అవ్వగా ఎలాగోలా వీకెండ్ లో హోల్డ్ ని ఏమైనా చూపెడుతుంది అని అనుకున్నా కూడా అనుకున్న దాని కన్నా కూడా ఎక్కువగానే డ్రాప్స్ ను సొంతం చేసుకుంది సినిమా..
ఆన్ లైన్ టికెట్ సేల్స్ లో డే 1 తో పోల్చితే డే 2 డ్రాప్స్ ఆల్ మోస్ట్ 45-50% రేంజ్ లో కనిపిస్తూ ఉండటం ఏమాత్రం మంచి విషయం కాదనే చెప్పాలి. ఆఫ్ లైన్ లో కౌంటర్ దగ్గర టికెట్ సేల్స్ ఏమైనా హోల్డ్ ని చూపెడితే తప్పితే సినిమా రెండో రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర…
మినిమమ్ ఇంపాక్ట్ ను కూడా ఇప్పుడు చూపించే అవకాశం తక్కువగానే కనిపిస్తూ ఉంది. ఓవరాల్ గా ప్రజెంట్ ట్రెండ్ ను బట్టి చూస్తూ ఉంటే తెలుగు రాష్ట్రాల్లో రెండో రోజున 55-60 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉండగా…ఫైనల్ ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే…
ఈ లెక్క కొంచం పెరిగే అవకాశం ఉందని చెప్పాలి. ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా మరియు ఓవర్సీస్ లో కూడా సినిమా పెద్దగా జోరుని అయితే చూపించలేక పోతూ ఉండటంతో వరల్డ్ వైడ్ గా 2వ రోజున 85 లక్షల రేంజ్ నుండి కోటి రేంజ్ వరకు షేర్ ని అటూ ఇటూగా అందుకునే అవకాశం ఉంది.
సినిమా సాధించాల్సిన వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ దృశ్యా చూసుకుంటే అసలు ఈ కలెక్షన్స్ ఏమాత్రం సరిపోవు అనే చెప్పాలి. ఇక సినిమా రెండు రోజులకు గాను బాక్స్ ఆఫీస్ దగ్గర సాధించే అఫీషియల్ కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి ఇప్పుడు.