బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు అంచనాలను అందుకోవడంలో విఫలం అయిన లైగర్ సినిమా స్టిల్ టాలీవుడ్ మీడియం రేంజ్ మూవీస్ లో బిగ్గెస్ట్ డే 1 కలెక్షన్స్ రికార్డ్ ను నమోదు చేసింది. ఇక సినిమా ఓవరాల్ గా డే 1 అనుకున్న కలెక్షన్స్ ని అస్సలు అందుకోలేక పోయింది. బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు రెండో రోజు విషయానికి వస్తే… రెండో రోజుకి గాను సినిమా అడ్వాన్స్ టికెట్ సేల్స్ ద్వారా నైజాంలో…
1.20 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను తెలుగు రాష్ట్రాలకు గాను 2 కోట్ల లోపు గ్రాస్ ను అందుకోగా టోటల్ ఇండియాకి గాను 3.2 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకుంది, ఇక మొదటి రోజుతో పోల్చితే రెండో రోజు ఆల్ మోస్ట్ 70% రేంజ్ లో డ్రాప్స్ ను…
సినిమా తెలుగు రాష్ట్రాల్లో సొంతం చేసుకుంది ఇప్పుడు, అన్ని సెంటర్స్ లో భారీ డ్రాప్స్ కనిపించగా మాస్ సెంటర్స్ లో కూడా పెద్దగా ఇంపాక్ట్ కనిపించడం లేదు. మొత్తం మీద సినిమా ఈ రోజే హిందీలో రిలీజ్ అవుతూ ఉండగా అక్కడ బుకింగ్స్ కి ఇక్కడ నుండి స్ప్రెడ్ అయిన మౌత్ టాక్…
మరింత ఇంపాక్ట్ ని చూపించబోతుంది. ఓవరాల్ గా రెండో రోజు సినిమా తెలుగు రాష్ట్రాలలో ప్రజెంట్ ట్రెండ్ ని బట్టి చూస్తుంటే… 2.5 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకునే అవకాశం ఉందని చెప్పాలి. అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే 2.8 కోట్ల నుండి 3 కోట్ల రేంజ్ లో షేర్ ని సినిమా అందుకోవచ్చు.
ఇక వరల్డ్ వైడ్ గా సినిమా 5 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉంది, కానీ సినిమా అందుకోవాల్సిన టార్గెట్ దృశ్యా ఈ కలెక్షన్స్ అసలు ఏమాత్రం సరిపోవు అనే చెప్పాలి. మరి డే 2 ఎండ్ అయ్యే టైం కి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎంతవరకు కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి.