Home న్యూస్ 2nd డే టాప్ షేర్ మూవీస్…సంక్రాంతికి వస్తున్నాం రికార్డుల జాతర!

2nd డే టాప్ షేర్ మూవీస్…సంక్రాంతికి వస్తున్నాం రికార్డుల జాతర!

0

సంక్రాంతికి వచ్చిన ఇతర సినిమాలతో పోల్చితే బడ్జెట్ పరంగా, బిజినెస్ పరంగా అలాగే రిలీజ్ పరంగా చూసుకుంటే చిన్న సినిమాలనే అనిపించిన విక్టరీ వెంకటేష్(Victory Venkatesh) అనిల్ రావిపూడి ల సంక్రాంతికి వస్తున్నాం(Sankranthiki Vasthunam Movie) కలెక్షన్స్ పరంగా మాత్రం ఇతర సినిమాలను ఫుల్లుగా డామినేట్ చేస్తూ దుమ్ము లేపుతుంది…

అన్ని ఏరియాల్లో హౌస్ ఫుల్ బోర్డులతో మాస్ జాతర సృష్టిస్తూ దూసుకు పోతున్న సినిమా రెండో రోజు తెలుగు రాష్ట్రాల్లో వన్ ఆఫ్ ది హైయెస్ట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపింది. ఇక్కడ విశేషం ఏంటి అంటే ఇతర సినిమాలు బిగ్ పాన్ ఇండియా మూవీస్ మధ్యలో…

Sankranthiki Vasthunam 2 Days Total WW Collections!!

లాస్ట్ ఇయర్ డిసాస్టర్ కొట్టిన వెంకిమామ తనతో 2 హిట్స్ కొట్టిన అనిల్ రావిపూడితో హాట్రిక్ ని ఓ రేంజ్ లో సెలెబ్రేట్ చేసుకుంటూ కెరీర్ బెస్ట్ రికార్డులతో మాస్ జాతర సృష్టిస్తూ దూసుకు పోతున్నాడు…2వ రోజున తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా 14.24 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని ఊచకోత కోయగా…

తెలుగు రాష్ట్రాల్లో ఓవరాల్ గా ఆల్ టైం హైయెస్ట్ కలెక్షన్స్ ని రెండో రోజు సొంతం చేసుకున్న సినిమాల్లో సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఏకంగా టాప్ 8 ప్లేస్ ను సొంతం చేసుకుని దుమ్ము దుమారం చేసింది…ఒకసారి రెండో రోజు తెలుగు రాష్ట్రాల్లో హైయెస్ట్ కలెక్షన్స్ ని అందుకున్న సినిమాలను గమనిస్తే….

AP-TG 2nd Day Highest Share Movies

2nd Day All Time Highest Share movies in Telugu States
👉#RRRMovie – 31.63CR
👉#Salaar- 21.23CR
👉#Kalki2898AD – 20.00CR
👉#Pushpa2TheRule – 19.25CR
👉#Devara Part 1 – 17.92CR
👉#AdiPurush – 15.04CR
👉#Baahubali2 -14.80Cr
👉#SankranthikiVasthunam – 14.24CR*******
👉#Pushpa – 13.70Cr
👉#KGF2(Dub)- 13.37CR
👉#BheemlaNayak – 13.14Cr
👉#RadheShyam – 12.34Cr
👉#WaltairVeerayya – 11.95CR

ఓవరాల్ గా ఈ లిస్టులో బిగ్ పాన్ ఇండియా మూవీస్ అలాగే బిగ్ బడ్జెట్ మూవీస్ కి దీటుగా దుమ్ము లేపిన సంక్రాంతికి వస్తున్నాం మూవీ ఊరమాస్ హోల్డ్ ని చూపెడుతూ ఉండగా ఇదే ఊపుని లాంగ్ రన్ లో కొనసాగించే అవకాశం ఉండగా మరిన్ని రికార్డులను లాంగ్ రన్ లో సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here