బాక్స్ ఆఫీస్ దగ్గర 2010 టైంలో రిలీజ్ అయినప్పుడు అంచనాలను అందుకోలేక డిసాస్టర్ రిజల్ట్ ను సొంతం చేసుకున్న రామ్ చరణ్(Ram Charan) నటించిన ఆరెంజ్(Orange Movie) తర్వాత టైంలో పాటలు ఓ రేంజ్ లో హిట్ అవ్వడంతో కల్ట్ స్టేటస్ ను సొంతం చేసుకుంది. రెండేళ్ళ క్రితం రీ రిలీజ్ అయినప్పుడు అందరి అంచనాలను మించి పోయిన సినిమా…
ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని మాస్ కుమ్ముడు కుమ్మేయగా…మళ్ళీ ఇప్పుడు రెండేళ్ళ తర్వాత వాలెంటైన్స్ వీకెండ్ లో రెండో సారి రీ రిలీజ్ అవ్వగా ఈ సారి కూడా ఆడియన్స్ ను భారీ లెవల్ లోనే థియేటర్స్ కి రప్పిస్తూ దుమ్ము లేపుతున్న ఈ సినిమా… రిలీజ్ రోజు తో కలిపి ఓవరాల్ గా…
50 వేల రేంజ్ లో టికెట్ సేల్స్ ను సొంతం చేసుకుని 90 లక్షల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని మాస్ రచ్చ చేసింది. ఇక సినిమా రెండో రోజు లో కూడా మేజర్ సెంటర్స్ లో థియేటర్స్ ఫుల్ అవ్వగా ఓవరాల్ గా 8 వేల లోపు టికెట్ సేల్స్ ను సొంతం చేసుకున్న సినిమా…
రెండో రోజు ఓవరాల్ గా 22-25 లక్షల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని మరోసారి కుమ్మేయడం విశేషం అని చెప్పాలి ఇప్పుడు….ఓవరాల్ గా రెండు రోజుల రీ రిలీజ్ లో సినిమా ఆల్ మోస్ట్ 1.1 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకుని మాస్ రచ్చ చేసింది…
ఇక ఫస్ట్ టైం రీ రిలీజ్ అయినప్పటి కలెక్షన్స్ 3.35 కోట్ల మార్క్ తో ఈ సెకెండ్ రీ రిలీజ్ టైం కలెక్షన్స్ ని యాడ్ చేస్తే ఓవరాల్ గా 4.45 కోట్ల రేంజ్ లో రీ రిలీజ్ కలెక్షన్స్ ని పెంచుకున్న సినిమా ఇప్పుడు మూడో రోజు కూడా సండే అడ్వాంటేజ్ తో మరోసారి జోరు చూపెడుతూ ఉండగా కలెక్షన్స్ ని మరింత పెంచుకోవడం ఖాయంగా కనిపిస్తుంది…