2023 ఇయర్ లో టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) నటించిన ఎపిక్ లవ్ స్టొరీ తొలిప్రేమ(Tholiprema4K) సినిమా రీ రిలీజ్ అయ్యి మంచి వసూళ్ళని సొంతం చేసుకుంది. ఆల్ మోస్ట్ 1.52 కోట్ల రేంజ్ లో వసూళ్ళని రీ రిలీజ్ లో అందుకుని మంచి సక్సెస్ ను అందుకోగా మళ్ళీ రెండేళ్ళ తర్వాత…
ఇప్పుడు సినిమాను మళ్ళీ రీసెంట్ గా సెకెండ్ టైం రీ రిలీజ్ చేశారు….కాగా రిలీజ్ కి ముందు రోజు వరకు ఓవరాల్ గా 13.50 వేలకు పైగా టికెట్ సేల్స్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా రిలీజ్ రోజున కూడా పర్వాలేదు అనిపించే రేంజ్ లో ట్రెండ్ ను చూపించగా…
ఆల్ మోస్ట్ 7.5 వేల రేంజ్ లో టికెట్ సేల్స్ ను సొంతం చేసుకోగా ఓవరాల్ గా ఇప్పటి వరకు జరిగిన టికెట్ సేల్స్ తో సినిమా 21 వేల రేంజ్ లో టికెట్ సేల్స్ ను అందుకుంది. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర సెకెండ్ రీ రిలీజ్ మొదటి రోజున ఆల్ మోస్ట్ సినిమా…
అనుకున్న అంచనాలను మించి పోయి ఓవరాల్ గా 63 లక్షల రేంజ్ లో గ్రాస్ వసూళ్ళని సొంతం చేసుకుంది. అందులో మేజర్ గా నైజాం నుండే సినిమా 34 లక్షల రేంజ్ లో కలెక్షన్స్ ని అందుకోవడం విశేషం అని చెప్పాలి. సినిమా సెకెండ్ రీ రిలీజ్ ను…
సడెన్ గా అనౌన్స్ చేసినా కూడా ఉన్నంతలో సినిమా మంచి జోరునే బాక్స్ ఆఫీస్ దగ్గర చూపించింది. ఓవరాల్ గా మొదటి సారి రీ రిలీజ్ వసూళ్ళని కూడా కలిపితే ఓవరాల్ గా 2.15 కోట్ల మార్క్ ని దాటిన సినిమా వీకెండ్ లో పర్వాలేదు అనిపించేలా పెర్ఫార్మ్ చేసే అవకాశం ఎంతైనా ఉంది.