బాక్స్ ఆఫీస్ దగ్గర ఉస్తాద్ రామ్ పోతినేని(Ram Pothineni) బోయపాటి శ్రీను(Boyapati Sreenu) ల కాంబినేషన్ లో ఆడియన్స్ ముందుకు వచ్చిన లేటెస్ట్ మూవీ స్కంద(Skanda) మూవీ మీడియం రేంజ్ మూవీస్ లో సాలిడ్ అంచనాలతో బరిలోకి దిగి మాస్ ఓపెనింగ్స్ ను అందుకుంటుంది అనుకున్నా కూడా….
బోయపాటి మరీ రొటీన్ గా సినిమాను తీయడంతో ఆడియన్స్ నుండి మిక్సుడ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా ఎలాగోలా రామ్ అండ్ బోయపాటి మాస్ పుల్ వలన కొంచం బాగానే కలెక్షన్స్ ని అందుకున్నా కూడా టార్గెట్ కి చాలా దూరంలోనే ఆగిపోయింది…
సినిమా రిలీజ్ టైంలో సినిమా లో కొన్ని సీన్స్ సోషల్ మీడియాలో బాగానే ట్రోల్ అయ్యాయి… ఒక వ్యక్తి తల తప్పి చంపడం, హీరో సింపుల్ గా ఇద్దరు సిఎమ్ ల ను ఇబ్బంది పెట్టడం, లాజిక్ లేని చాలా సీన్స్ ను సినిమాలో పెట్టగా అవన్నీ ఇప్పుడు సినిమా డిజిటల్ రిలీజ్ అయిన తర్వాత…
సోషల్ మీడియా మొత్తం ట్రెండ్ అవుతున్నాయి. ట్విట్టర్ లో స్కంద హాష్ టాగ్ నిండా ఇవే ట్వీట్స్ ఉండటం చూసి సినిమాకి డిజిటల్ రిలీజ్ లో సాలిడ్ గా సెకెండ్ రౌండ్ ట్రోల్స్ పదుతున్నాయి ఇప్పుడు…. బోయపాటి రీసెంట్ గా ఒక్క బాలయ్యతో తప్పితే చేసిన మిగిలిన సినిమాలు…
అనుకున్న రేంజ్ లో ఏమాత్రం తీయలేదు, స్టోరీ కూడా మరీ రొటీన్ కథనే తీసుకుని దానికి భారీగా ఫ్యామిలీ హంగులు, మాస్ ఎపిసోడ్స్ ని రాసుకున్నా కూడా అవి అంతగా వర్కౌట్ అవ్వడం లేదు, ఇప్పుడు స్కంద విషయంలో కూడా ఇదే రిపీట్ అవ్వగా సోషల్ మీడియాలో సినిమా సాలిడ్ గా ట్రోల్స్ పడుతూ ఉండటం చూసి బోయపాటి తన స్టైల్ మార్చాల్సిన అవసరం ఎంతైనా ఉందని అందరూ అనుకుంటున్నారు…