బాక్స్ ఆఫీస్ దగ్గర రచ్చ చేసిన సినిమాలు అన్నీ తర్వాత టెలివిజన్ లో కూడా కుమ్మేయాలని రూల్ ఏమి లేదు కానీ, బాక్స్ ఆఫీస్ దగ్గర ఊహకందని విజయాన్ని అందుకున్న సినిమా టెలివిజన్ లో టెలికాస్ట్ అయినప్పుడు మినిమమ్ ఇంపాక్ట్ ని అయితే చూపెడుతుంది అని అందరూ అనుకోవడం మాత్రం ఖాయం అని చెప్పాలి.
కానీ లాస్ట్ ఇయర్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఊహకందని విజయాన్ని సొంతం చేసుకున్న మూవీస్ లో ఒకటైన పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన రీసెంట్ మూవీ కల్కి(Kalki 2898 AD TRP Rating) సినిమా ఊహకందని రేంజ్ లో వసూళ్ళతో…
సంచలనం సృష్టించగా….టోటల్ రన్ లో ఏకంగా 1061 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకుని సంచలన విజయాన్ని అందుకోగా తర్వాత డిజిటల్ లో కూడా మాస్ రచ్చ చేసింది. దాంతో తర్వాత టెలివిజన్ లో కూడా సినిమా కుమ్మేయడం ఖాయమని..
అందరూ అనుకోగా జీ తెలుగు వాళ్ళు సినిమాకి సాలిడ్ రేటు చెల్లించి హక్కులను తీసుకోగా…ఫస్ట్ టైం టెలికాస్ట్ అయినప్పుడు ఓవరాల్ గా 5.26 టి.ఆర్.పి రేటింగ్ ను మాత్రమే సొంతం చేసుకుని హ్యూజ్ హిట్ అయిన బిగ్ మూవీస్ లో వన్ ఆఫ్ ది లోవేస్ట్…
రేటింగ్ ను సొంతం చేసుకున్న సినిమాగా నిలిచింది. మొదటి సారి మిస్ అయ్యిందేమో రెండో సారి జోరు చూపుతుంది అనుకున్నా కూడా రీసెంట్ గా సెకెండ్ టైం టెలికాస్ట్ అయిన సినిమా రెండో సారి కూడా ఏమాత్రం హోల్డ్ ని అయితే చూపించ లేక పోయింది..
మొత్తం మీద సెకెండ్ టైం టెలికాస్ట్ లో సినిమా కేవలం 2.29 టి.ఆర్.పి రేటింగ్ ను మాత్రమే సొంతం చేసుకుంది. దాంతో బాక్స్ ఆఫీస్ దగ్గర ఎంత పెద్ద విజయాన్ని అందుకున్నా కూడా టెలివిజన్ లో మాత్రం కల్కి మూవీ ఏమాత్రం ఇంపాక్ట్ ను చూపించలేక పోయింది.