లాస్ట్ ఇయర్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఇండియన్ సినిమా రికార్డుల బెండు తీసి ఎపిక్ సక్సెస్ ను సొంతం చేసుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) నటించిన…ఎపిక్ ఇండియన్ బ్లాక్ బస్టర్ మూవీ పుష్ప2(Pushpa 2 The Rule) సినిమా ఊహకందని వసూళ్ళతో అన్ని చోట్లా మాస్ ఊచకోత కోసింది. హిందీలో ఎపిక్ రికార్డులు సృష్టించింది.
టోటల్ రన్ లో అందరి అంచనాలను మించిపోయి 1775 కోట్లకు పైగా గ్రాస్ ను అందుకుంది ఈ సినిమా…. తెలుగు లో కూడా సెన్సేషనల్ వసూళ్ళని అందుకున్న ఈ సినిమా తర్వాత డిజిటల్ లో కూడా ఎక్స్ లెంట్ వ్యూవర్ షిప్ ను సొంతం చేసుకుని మాస్ రచ్చ చేయగా తర్వాత..
టెలివిజన్ లో టెలికాస్ట్ అయిన సినిమా కి ఇక్కడ ఎక్స్ లెంట్ రేటింగ్ సొంతం అవుతుందని అందరూ అనుకున్నారు. అలాగే అల్లు అర్జున్ రీసెంట్ మూవీస్ అన్నీ కూడా టెలివిజన్ లో అద్బుతాలు సృష్టించడంతో ఈ సినిమా విషయంలో కూడా అదే రిపీట్ అవుతుంది…
అనుకున్నా ఓవరాల్ గా ఫస్ట్ టెలికాస్ట్ లో సినిమా కి 12.61 రేంజ్ లో టి.ఆర్.పి రేటింగ్ సొంతం అయ్యింది. రీసెంట్ టైంలో టెలివిజన్ లో సినిమాలకు రేటింగ్స్ చాలా వరకు తగ్గుతూ రాగా ఈ సినిమాకి ఉన్నంతలో పర్వాలేదు అనిపించగా రీసెంట్ గా …
సెకెండ్ టైం కూడా టెలికాస్ట్ అయిన పుష్ప2 సినిమా కి రెండో సారి పర్వాలేదు అనిపించే రేంజ్ లో హోల్డ్ ని చూపెడుతూ…7.22 రేంజ్ లో టి.ఆర్.పి రేటింగ్ సొంతం అయ్యింది ఇప్పుడు. ఆల్ మోస్ట్ కొన్ని పెద్ద సినిమాలకు ఫస్ట్ టెలికాస్ట్ లో ఇలాంటి రేటింగ్….
వస్తూ ఉండగా రెండో టెలికాస్ట్ లో మంచి హోల్డ్ నే పుష్ప2 సినిమా చూపించగా ఓవరాల్ గా ఛానెల్ కొన్న రేటు దృశ్యా లాంగ్ రన్ లో ఇదే రేంజ్ హోల్డ్ తో జోరు కంటిన్యూగా చూపించాల్సిన అవసరం సినిమాకి ఎంతైనా ఉంది.