బాక్స్ ఆఫీస్ దగ్గర టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) నటించిన ఎపిక్ లవ్ స్టొరీ తొలిప్రేమ(Tholiprema4K) సినిమా రెండేళ్ళ క్రితం రిలీజ్ అయ్యి 25 ఏళ్ళు కంప్లీట్ అయిన నేపధ్యంలో భారీ గా రీ రిలీజ్ అయ్యి మంచి కలెక్షన్స్ తో సందడి చేసింది. కాగా సడెన్ గా సినిమాను ఇప్పుడు రెండేళ్ళ తర్వాత…
మళ్ళీ ఈ వీకెండ్ లో రీ రిలీజ్ చేయగా ఆడియన్స్ నుండి ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటూ పరుగును కొనసాగిస్తుంది అన్నది ఆసక్తి గా మారగా సినిమా సెకెండ్ రీ రిలీజ్ లో పర్వాలేదు అనిపించేలా పెర్ఫార్మ్ చేస్తుంది అని చెప్పాలి.
రిలీజ్ కి ముందు రోజు వరకు జరిగిన అడ్వాన్స్ బుకింగ్స్ లో ఓవరాల్ గా 13.5 వేలకు పైగా టికెట్ సేల్స్ ను సొంతం చేసుకుంది. ఇక రిలీజ్ రోజున కొన్ని చోట్ల మంచి బుకింగ్స్ ను సొంతం చేసుకుని జోరు చూపించిన ఈ సినిమాకి మేజర్ సెంటర్స్ లో మంచి కలెక్షన్స్ ని అందుకుంటూ ఉండగా…
తొలిరోజు వసూళ్లు కూడా డీసెంట్ గా ఉండే అవకాశం ఎంతైనా ఉంది. మొత్తం మీద ఈవినింగ్ అండ్ నైట్ షోలకు కూడా ట్రెండ్ ఇలానే కొనసాగితే ఓవరాల్ మొదటి రోజున 40-45 లక్షల రేంజ్ లో వసూళ్ళని అందుకునే అవకాశం ఉందని చెప్పాలి.
ఫస్ట్ టైం రీ రిలీజ్ అయినప్పుడు సినిమా 1.52 కోట్ల రేంజ్ లో వసూళ్ళని అందుకుంది…ఇప్పుడు రెండో సారి రీ రిలీజ్ లో కూడా డీసెంట్ కలెక్షన్స్ ని అందుకోబోతున్న సినిమా వీకెండ్ లో పర్వాలేదు అనిపించేలా ట్రెండ్ ను చూపించే అవకాశం ఉంది. ఇక సెకెండ్ రీ రిలీజ్ ఫస్ట్ డే కలెక్షన్స్ ఈ అంచనాలను ఎంతవరకు మించుతాయో చూడాలి.