Home న్యూస్ 24 గంటలు ఓవర్…కల్కి 2nd ట్రైలర్ కి సాలిడ్ రెస్పాన్స్!

24 గంటలు ఓవర్…కల్కి 2nd ట్రైలర్ కి సాలిడ్ రెస్పాన్స్!

0

వారం గ్యాప్ లోనే రెండు ట్రైలర్ లను రిలీజ్ చేయడం రీసెంట్ టైంలో రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ కల్కి 2898AD( Kalki2898AD Movie) సినిమాకే చెల్లింది అని చెప్పాలి…ఫస్ట్ ట్రైలర్ లో కథని కొద్ది వరకు రివీల్ చేసినా కూడా విజువల్స్ కొంచం అండర్ ప్లే చేసినట్లు టాక్ వచ్చింది…

కానీ ట్రైలర్ 2 మాత్రం సినిమాలో ఏ రేంజ్ లో విజువల్స్ ఉండబోతున్నాయో అన్నది భారీగా చూపించగా కొన్ని షాట్స్ అయితే అంచనాలు మరో లెవల్ లో పెరిగేలా చేసింది….ఇక ట్రైలర్2 ను రిలీజ్ చేసే విషయంలో టీం చాలా ఆలస్యం చేసిన మేకర్స్ వలన ఫ్యాన్స్ కి కోపం వచ్చి సోషల్ మీడియాలో ట్రోల్స్ కూడా భారీగా చేయగా….

సినిమా ట్రైలర్2 ని కొంచం ఆలస్యంగా రిలీజ్ చేశారు…రిలీజ్ చేసిన తర్వాత రెస్పాన్స్ సూపర్ సాలిడ్ గా రాగా 24 గంటల్లో ఓవరాల్ గా ఈ ట్రైలర్ కి సాలిడ్ రెస్పాన్స్ సొంతం అయ్యింది అనే చెప్పాలి. మొత్తం మీద 24 గంటలు పూర్తి అయ్యే టైంకి కల్కి ట్రైలర్2 కి 12.03 మిలియన్ వ్యూస్ సొంతం అవ్వగా…

లైక్స్ పరంగా కూడా మంచి జోరుని చూపించిన ట్రైలర్ కి 485.7K లైక్స్ సొంతం అవ్వడం విశేషం అని చెప్పాలి. మొత్తం మీద ట్రైలర్ 2 కి లేట్ రిలీజ్ అయినా కూడా 24 గంటల్లో సాలిడ్ రెస్పాన్స్ సొంతం అయ్యి సినిమా మీద అంచనాలను భారీగా పెంచేసింది. హిందీలో సైతం సినిమాకి ఇప్పుడు అంచనాలు మరింతగా పెరిగిపోగా…

బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా బెటర్ గా పెర్ఫార్మ్ చేయడం ఇక ఖాయమని చెప్పాలి… సినిమా కూడా ట్రైలర్2 ఉన్నంత బాగా ఉంటే మాత్రం ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర రెబల్ స్టార్ మాస్ రాంపెజ్ ను చూడటం ఖాయమని చెప్పాలి…ఇక 27న సినిమా ఏ రేంజ్ లో రచ్చ చేస్తుందో చూడాలి ఇక…

KALKI2898AD WW Pre Release Business - Break Even Target!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here