నాచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ మూవీ దసరా ఆడియన్స్ ముందుకు వచ్చి వారం పూర్తీ అవ్వగా సినిమా మొదటి వారాన్ని ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో కంప్లీట్ చేసుకుని రెండో వారంలో అడుగు పెట్టింది, రెండో వారంలో కొత్త సినిమాల నుండి పోటి ఉన్నా కూడా భారీగానే థియేటర్స్ ని హోల్డ్ చేసిన దసరా సినిమా రాంపేజ్ ను రెండో వారంలో కూడా కొనసాగించడానికి సిద్ధం అవుతుందని చెప్పాలి ఇప్పుడు.
సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి వారంలో రిలీజ్ అవ్వడం 900 వరకు థియేటర్స్ లో తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ అవ్వగా రెండో వారంలో కొత్త సినిమాలు రిలీజ్ కి ఉన్నా కానీ సాలిడ్ గానే థియేటర్స్ ని హోల్డ్ చేసింది. మొత్తం మీద నైజాంలో సినిమా…
రెండో వారంలో 165 థియేటర్స్ ని హోల్డ్ చేసి దుమ్ము లేపగా సీడెడ్ లో 70 థియేటర్స్ ని హోల్డ్ చేయగా ఆంధ్రలో 205 కి పైగా థియేటర్స్ ని హోల్డ్ చేసి రెండో వారాన్ని కొనసాగిస్తుంది. దాంతో మొత్తం మీద రెండో వారంలో తెలుగు రాష్ట్రాల్లో సినిమా ఇప్పుడు టోటల్ గా…
440 వరకు థియేటర్స్ ని హోల్డ్ చేసి బాక్స్ ఆఫీస్ దగ్గర పరుగును కొనసాగిస్తూ ఉండటం విశేషం, పోటిలో రెండో వారంలో సగం వరకే థియేటర్స్ ని కోల్పోయిన సినిమా ఎక్స్ లెంట్ హోల్డ్ ని చూపించగా ఆంధ్ర సీడెడ్ లో బ్రేక్ ఈవెన్ కోసం సినిమా మరింత కష్టపడాల్సిన అవసరం అయితే ఇప్పుడు ఎంతైనా ఉందని చెప్పాలి.