Home న్యూస్ పుష్ప2 2nd వీక్ థియేటర్స్…..వీర లెవల్ మాస్ సామి ఇది!!

పుష్ప2 2nd వీక్ థియేటర్స్…..వీర లెవల్ మాస్ సామి ఇది!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ తో మొదటి వారాన్ని ఊరమాస్ గా కంప్లీట్ చేసుకున్న సెన్సేషనల్ మూవీ పుష్ప2(Pushpa 2 Movie) రెండో వారంలో అడుగు పెట్టింది….ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) నటించిన ఈ సినిమా మొదటి వారంలోనే అనేక రికార్డుల బెండు తీసింది….బాలీవుడ్ లో ఆల్ టైం రికార్డులు నమోదు చేయగా తెలుగు లో కూడా కుమ్మేసింది…

ఇక సినిమా రెండో వీక్ లో అడుగు పెట్టగా ఓవరాల్ గా ఎన్ని థియేటర్స్ లో రన్ ని ఇప్పుడు కొనసాగిస్తుంది అన్నది ఆసక్తిగా మారింది…సినిమా రెండో వీక్ లో తెలుగు రాష్ట్రాల్లో ఎక్స్ లెంట్ థియేటర్స్ ని హోల్డ్ చేసింది. నైజాంలో ఆల్ మోస్ట్ 250 వరకు థియేటర్స్ ని హోల్డ్ చేసిన సినిమా ఆంధ్ర మరియు సీడెడ్ లు కలిపి…

ఆల్ మోస్ట్ 800 వరకు థియేటర్స్ ని హోల్డ్ చేసి మాస్ రచ్చ చేస్తూ ఉండగా తెలుగు రాష్ట్రాల్లో ఓవరాల్ గా రెండో వీక్ లో 1050 కి పైగానే థియేటర్స్ లో పరుగును కొనసాగించనుంది…ఇక తమిళనాడులో సుమారు 350 కి పైగా థియేటర్స్ లో రన్ ను కొనసాగించబోతున్న సినిమా….

కర్ణాటకలో 200 వరకు థియేటర్స్ లో కేరళలో 150 వరకు థియేటర్స్ లో రన్ ను రెండో వీక్ లో కొనసాగించ బోతుంది…ఇక హిందీ లో మాత్రం సినిమా సెన్సేషనల్ హోల్డ్ ని చూపిస్తుంది…రెండో వీక్ లో అసలు పోటినే లేదు కాబట్టి అక్కడ ఆల్ మోస్ట్ 3500 వరకు థియేటర్స్ ని హోల్డ్ చేసింది సినిమా…

దాంతో టోటల్ గా ఇండియా లో సినిమా 5250 కి పైగా థియేటర్స్ లో రెండో వారాన్ని కొనసాగించబోతుంది. ఇక ఓవర్సీస్ లో సినిమా ఆల్ మోస్ట్ 2000 వరకు థియేటర్స్ ని హోల్డ్ చేసినట్లు అంచనా…దాంతో సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా ఇప్పుడు ఆల్ మోస్ట్ 7250 వరకు థియేటర్స్ లో పరుగును కొనసాగిస్తుంది..

రెండో వీక్ లో ఎక్కడా పెద్దగా పోటి ఏమి లేదు కాబట్టి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మరోసారి ఈ వీక్ లో సాలిడ్ కలెక్షన్స్ తో మాస్ రచ్చ చేసే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ వీక్ లో సినిమా మరిన్ని బాక్స్ ఆఫీస్ రికార్డులను నమోదు చేయడం ఖాయమని చెప్పాలి ఇప్పుడు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here