బాక్స్ ఆఫీస్ దగ్గర బాక్ టు బాక్ రెండు భారీ డిసాస్టర్ మూవీస్ తో సతమతం అయిన తరుణంలో కెరీర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ తో యువ సామ్రాట్ అక్కి నేని నాగ చైతన్య(Naga Chaitanya) నటించిన లేటెస్ట్ మూవీ తండేల్(Thandel Movie) సినిమా అన్ని చోట్లా ఎక్స్ లెంట్ గా రచ్చ చేసి సెన్సేషనల్ కలెక్షన్స్ తో దుమ్ము దుమారం లేపుతూ సంచలనం సృష్టించింది.
సినిమా ఓపెనింగ్ వీకెండ్ లో రెండు రోజులు మీడియం రేంజ్ మూవీస్ లో రికార్డ్ కలెక్షన్స్ తో భీభత్సం సృష్టించింది. ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు రెండు డిసాస్టర్స్ తర్వాత నాగ చైతన్యకి సెన్సేషనల్ కంబ్యాక్ మూవీ లానే కాకుండా మరో బిగ్ బెంచ్ మార్క్ ని అందుకుని రచ్చ లేపింది…
6 రోజుల్లో ఆల్ మోస్ట్ 39.8 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకున్న సినిమా 7వ రోజున సాధించిన కలెక్షన్స్ తో ఇప్పుడు 40 కోట్ల క్లబ్ లో చేరి సంచలనం సృష్టించింది. మీడియం రేంజ్ హీరోలలో 40 కోట్ల షేర్ అనేది చాలా టైంగా ఒక బెంచ్ మార్క్ గా ఉండగా టాప్ స్టార్స్ 100 కోట్ల బెంచ్ మార్క్ ని దాటేయగా….
రీసెంట్ టైంలో మీడియం రేంజ్ హీరోల్లో ఫామ్ లో ఉన్న హీరోలు తక్కువే కాగా నాగ చైతన్య 2019 టైంలో మొదటి సారిగా మజిలీ మూవీతో ఈ 40 కోట్ల బెంచ్ మార్క్ ని అందుకోగా తర్వాత చేసిన సోలో సినిమాలు ఏవి కూడా ఈ మార్క్ ని అందుకోలేదు. లవ్ స్టోరీ మూవీ రికార్డులు నమోదు చేస్తుంది అనుకున్నా…
50% ఆక్యుపెన్సీ లిమిటేషన్స్ నడుమ రిలీజ్ అయ్యి 35 కోట్ల షేర్ కే పరిమితం అవ్వాల్సి వచ్చింది, కానీ ఇప్పుడు రెండు డిసాస్టర్ సింగిల్ డిజిట్ మూవీస్ తర్వాత నాగ చైతన్య తండేల్ మూవీ తో కేవలం 7 రోజుల్లోనే 40 కోట్ల షేర్ మార్క్ ని అందుకుని మాస్ రచ్చ చేయగా…
కెరీర్ లో బిగ్ కంబ్యాక్ ను అందుకోవడమే కాదు, దాంతో పాటు 2 సార్లు బాక్స్ ఆఫీస్ దగ్గర 40 కోట్ల షేర్ మార్క్ ని కూడా అందుకుని దుమ్ము లేపడం విశేషం అని చెప్పాలి. ఇక సినిమా రెండో వీక్ లో జోరు కొనసాగిస్తే ఈజీగా 50 కోట్ల షేర్ మార్క్ ని కూడా అందుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి.