బాక్స్ ఆఫీస్ దగ్గర నట సింహం నందమూరి బాలకృష్ణ కి అఖండ కి ముందు వరుసగా 3 అత్యంత భారీ డిసాస్టర్లు పడ్డ విషయం తెలిసిందే. ఎన్టీఆర్ సిరీస్ తో పాటు చేసిన రూలర్ సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర ఏమాత్రం ఇంపాక్ట్ చూపించ లేకపోయాయి. బాక్ టు బాక్ ఎపిక్ డిసాస్టర్స్ గా నిలిచిన ఆ సినిమాల తర్వాత బాలయ్య చేసిన అఖండ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ కలెక్షన్స్ తో…
బాలయ్య కెరీర్ లో బిగ్గెస్ట్ కలెక్షన్స్ తో దుమ్ము దుమారం లేపిన విషయం తెలిసిందే. లాంగ్ రన్ లో ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో ఊచకోత కోసిన సినిమా 75 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని సంచలనం సృష్టించగా ఇప్పుడు బాలయ్య నటించిన…
లేటెస్ట్ మూవీ వీర సింహా రెడ్డి సినిమా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దుమ్ము లేపుతూ రెండో వారంలో కూడా సూపర్బ్ గా హోల్డ్ చేసే అవకాశం కనిపిస్తూ ఉండగా సినిమా 8వ రోజు సాధించిన కలెక్షన్స్ తో ఇప్పుడు 70 కోట్ల షేర్ మార్క్ ని అందుకుని ఊచకోత కోయగా…
హాట్రిక్ డిసాస్టర్స్ తర్వాత సినిమా ఇప్పుడు…. బాక్ టు బాక్ 2 సార్లు 70 కోట్ల షేర్ మార్క్ ని అందుకుని సంచలనం సృష్టించాడు బాలయ్య. ఇక ఈ సినిమా ఈ వీకెండ్ లో ఇలానే గ్రోత్ ని చూపించే కలెక్షన్స్ ని సాధిస్తే అఖండ సినిమా ఫైనల్ కలెక్షన్స్ ని దాటేసే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి.