బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు వారాల క్రితం మంచి అంచనాల నడుమ రిలీజ్ అయిన కోలివుడ్ టాప్ హీరోలలో ఒకరైన అజిత్ కుమార్(Ajith Kumar) నటించిన కొత్త సినిమా గుడ్ బ్యాడ్ అగ్లీ(Good Bad Ugly Movie) మూవీ, అన్ని చోట్లా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో మాస్ రచ్చ చేస్తూ దూసుకు పోతూ ఇప్పుడు 2 వారాలను పూర్తి చేసుకుంది.
తెలుగు రాష్ట్రాల్లో సినిమా పెద్దగా ఏమి ఇంపాక్ట్ ను చూపించ లేక పోయినా కూడా తమిళనాడు అలాగే వరల్డ్ వైడ్ మాత్రం మంచి జోరుని చూపించి బాక్స్ ఆఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్ కి మరింత దగ్గరగా వెళ్ళబోతుంది అని చెప్పాలి. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర…
తెలుగు రాష్ట్రాల్లో 14వ రోజున 10 లక్షల రేంజ్ లో గ్రాస్ ను అందుకోగా టోటల్ గా 2 వారాలు పూర్తి అయ్యే టైంకి 6.20 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకోగా 3.10 కోట్ల రేంజ్ లో షేర్ ని సాధించగా సినిమా క్లీన్ హిట్ కోసం ఇంకా 1.9 కోట్ల షేర్ ని అందుకోవాల్సి ఉంటుంది.
ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర వరల్డ్ వైడ్ గా 14వ రోజున ఇప్పుడు 3.35 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ని అందుకోగా 1.75 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది ఇప్పుడు. ఇక టోటల్ గా సినిమా 2 వారాలు పూర్తి అయ్యే టైంకి టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Good Bad Ugly Movie 14 Days Total WW Collections Approx
👉Tamilnadu – 142.00Cr
👉Telugu States – 6.20Cr
👉Karnataka – 14.00Cr
👉Kerala – 3.35Cr
👉ROI – 2.35Cr
👉Overseas – 61.85Cr***approx
Total WW collection – 229.75CR (112.45CR~ Share) Approx
(97%~ Recovery)
మొత్తం మీద సినిమా 116 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ తో 97% రేంజ్ లో రికవరీని సొంతం చేసుకోగా మరో 3.55 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన వసరం ఉండగా ఈ వీకెండ్ లో ఆ టార్గెట్ ను అందుకోవడం ఖాయమని చెప్పాలి ఇప్పుడు.