Home న్యూస్ 220 కోట్ల టార్గెట్…2 వీక్స్ లో హౌస్ ఫుల్5 టోటల్ కలెక్షన్స్ ఇవే!!

220 కోట్ల టార్గెట్…2 వీక్స్ లో హౌస్ ఫుల్5 టోటల్ కలెక్షన్స్ ఇవే!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ మధ్య వరుస ఫ్లాఫ్ మూవీస్ తో కెరీర్ లోనే బిగ్గెస్ట్ డౌన్ ఫాల్ లో ఉన్న బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్(Akshay Kumar)నటించిన హౌస్ ఫుల్ 5(HouseFull5 Movie) మూవీతో రీసెంట్ గా ఎక్స్ లెంట్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుని మాస్ రచ్చ చేశాడు. సినిమా కి ఆడియన్స్ నుండి పర్వాలేదు అనిపించే రేంజ్ లో..

రెస్పాన్స్ కూడా సొంతం అవ్వడంతో తన కెరీర్ లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ అనిపించే రేంజ్ లో ఓపెనింగ్స్ ను సినిమా సొంతం చేసుకుని మాస్ రచ్చ చేసింది. ఇక లాంగ్ రన్ లో కూడా దుమ్ము లేపడం ఖాయం అనుకున్నారు. సినిమా ఉన్నంతలో లాంగ్ రన్ లో బాగానే…

పెర్ఫార్మ్ చేసింది కానీ ఓవరాల్ గా సినిమాకి అయిన బడ్జెట్ అండ్ రికవరీ టార్గెట్ కొంచం పెద్దది అవ్వడంతో క్లీన్ హిట్ కోసం ఇంకా కష్టపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మొదటి వారం కంప్లీట్ అయ్యే టైంకి సినిమా 133.58 కోట్ల రేంజ్ లో వసూళ్ళని సొంతం చేసుకుంది.

ఇక రెండో వీక్ మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 43.51 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది. దాంతో టోటల్ గా 2 వారాలు కంప్లీట్ అయ్యే టైంకి ఇండియాలో సినిమా 177.09 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ మార్క్ ని సొంతం చేసుకుంది ఇప్పుడు.

సినిమా మొత్తం మీద ఇండియాలో డీసెంట్ హిట్ అనిపించుకోవాలి అంటే మినిమమ్ 220 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకోవాల్సిన అవసరం ఉంది. సినిమా 2 వారాల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 43 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకుంటే క్లీన్ హిట్ అవుతుంది.కానీ ఈ వీక్ లో అమీర్ ఖాన్ కొత్త సినిమా ఉన్న నేపద్యంలో ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుంది అన్నది ఆసక్తిగా మారింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here