పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ కల్కి 2898AD( Kalki2898AD Movie) సినిమా ఆడియన్స్ ముందుకు ఈ నెల 27న గ్రాండ్ గా రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతుంది…కాగా సినిమా ట్రైలర్ రిలీజ్ తర్వాత మంచి బజ్ అయితే పెరిగింది….ఓవర్సీస్ లో సినిమా ఆల్ రెడీ అడ్వాన్స్ బుకింగ్స్ పరంగా…
రికార్డులను క్రియేట్ చేస్తూ దూసుకు పోతుంది…కానీ అందులో మేజర్ బుకింగ్స్ తెలుగు నుండే ఉండగా హిందీ మరియు ఇతర వర్షన్ ల బుకింగ్స్ చాలా చాలా తక్కువగా ఉన్నాయి. ఇక తెలుగు రాష్ట్రాల బుకింగ్స్ ఇంకా ఓపెన్ అవ్వాల్సి ఉండగా ఇక్కడ ఎలాగూ ప్రభాస్ స్టార్ డం వలన సాలిడ్ ఓపెనింగ్స్ ను సినిమా సొంతం చేసుకోవడం ఖాయం….
కానీ మేకర్స్ కచ్చితంగా ఇప్పుడు సినిమాను ఇతర భాషల్లో ఇంకా ప్రమోషన్స్ ని పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రభాస్ లాస్ట్ మూవీ సలార్(Salaar) అస్సలు ప్రమోషన్స్ చేయలేదు కానీ తెలుగు హిందీలో మంచి కలెక్షన్స్ ని అందుకున్నా ఓవరాల్ గా సినిమా రేంజ్ కి ఇతర భాషల్లో అనుకున్న రేంజ్ లో కలెక్షన్స్ రాలేదు…
కానీ కల్కి మూవీ బడ్జెట్ ఇంకా ఎక్కువ కానీ మేకర్స్ జస్ట్ సినిమాలో వాడిన బుజ్జి బండితోనే ప్రమోషన్స్ లాగిస్తున్నారు కానీ దానికి ఏమాత్రం బజ్ అయితే పెరగడం లేదు ఇప్పుడు…సినిమా రిలీజ్ అయ్యాక టాక్ అద్బుతంగా ఉంటే తెలుగు లో మరోసారి దుమ్ము లేపవచ్చు…కానీ ఇది సలార్ లా మాస్ మూవీ కాదు కాబట్టి….
ప్రభాస్ కి మంచి మార్కెట్ ఉన్న హిందీలో అయినా ఇంకా ప్రమోషన్స్ ని పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది, 2 వారాల టైం కూడా లేని కల్కి మూవీ టీం నుండి ఎలాంటి ఇంటర్వ్యూలు లాంటివి కూడా లేవు, సలార్ లా వర్కౌట్ అవుతుందేమో అనుకుంటున్నారు కానీ ఇతర భాషల్లో బజ్ పెరగాలి అంటే కచ్చితంగా ప్రమోషన్స్ ని పెంచి తీరాల్సిందే… మరి మేకర్స్ డోస్ పెంచి ప్రమోషన్స్ చేస్తారో లేదో చూడాలి ఇక…