బాక్స్ ఆఫీస్ దగ్గర ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) నటించిన సెన్సేషనల్ మూవీ పుష్ప2(Pushpa 2 The Rule) మూవీ రీసెంట్ గా రిలీజ్ అయ్యి ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో రెండు వారాలను పూర్తి చేసుకుంది…సినిమా అన్ని చోట్లా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో కుమ్మేసిన పుష్ప2 మూవీ తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి జోరుని చూపించగా…
మమ్మోత్ బిజినెస్ లో సాలిడ్ రికవరీని దక్కించుకుని సినిమా మాస్ రచ్చ చేసింది కానీ ఇంకా మిగిలిన బిజినెస్ ను అందుకోవాలి అంటే ఇంకా జోరు చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు. ఇక సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఓవరాల్ గా…
215 కోట్ల రేంజ్ లో వాల్యూ షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉండగా మొదటి వారంలో సాలిడ్ కలెక్షన్స్ తో కుమ్మేసిన తర్వాత రెండో వీక్ లో కూడా సినిమా స్టడీగా జోరు చూపించగా ఇప్పుడు రెండు వారాలు పూర్తి అయ్యే టైంకి టోటల్ గా ఇక్కడ సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Pushpa 2 The Rule 2 Weeks Telugu States Total Collections(Inc GST)
👉Nizam: 90.36Cr
👉Ceeded: 29.62Cr
👉UA: 22.34Cr
👉East: 12.01Cr
👉West: 9.32Cr
👉Guntur: 14.60Cr
👉Krishna: 12.02Cr
👉Nellore: 7.27Cr
AP-TG Total:- 197.54CR(294.40CR~ Gross)
మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు రాష్ట్రాల్లో 215 కోట్ల షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉండగా 2 వారాల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా క్లీన్ హిట్ కోసం సినిమా ఇంకా 17.50 కోట్ల లోపు షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇంకా…
సినిమా కి ఇప్పుడు ఈ వీకెండ్ తో పాటు తర్వాత క్రిస్టమస్ హాలిడే అలాగే న్యూ ఇయర్ హాలిడేలు కలిసి రాబోతూ ఉండటంతో లాంగ్ రన్ లో మిగిలిన టార్గెట్ ను అందుకునే అవకాశం అయితే ఉంది. మరి సినిమా ఎంతవరకు జోరు చూపించగలుగుతుందో చూడాలి.