టాలీవుడ్ హీరోయిన్ సమంత(Samantha) నిర్మాతగా మారి నిర్మించిన మొదటి సినిమా శుభం(Subham Movie) మూవీ రీసెంట్ గా రిలీజ్ అయ్యి మంచి పర్వాలేదు అనిపించే రేంజ్ లో రెస్పాన్స్ ను ఆడియన్స్ నుండి సొంతం చేసుకోగా కలెక్షన్స్ పరంగా కూడా సినిమా స్టడీగానే జోరు చూపించి డీసెంట్ ఫుట్ ఫాల్స్ ను సొంతం చేసుకుంది.
రెండో వీక్ వర్కింగ్ డేస్ లో కొంచం స్లో డౌన్ అయినా కూడా సినిమా ఓవరాల్ గా మంచి జోరునే చూపించి డీసెంట్ ప్రాఫిట్స్ ను సొంతం చేసుకుని దుమ్ము లేపింది. 11-14 రోజుల గ్యాప్ లో సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఓవరాల్ గా 26 లక్షల రేంజ్ లో షేర్ మార్క్ ని అందుకోగా…
నార్త్ అమెరికాలో 264K డాలర్స్ మార్క్ దాకా వసూళ్ళని రాబట్టి అక్కడ మంచి లాభాలనే సొంతం చేసుకుంది. ఓవరాల్ గా నిర్మాతగా సమంతకి ఈ సినిమా మంచి లాభాలనే సొంతం అయ్యేలా చేసిందని చెప్పాలి ఇప్పుడు. ఓవరాల్ గా సినిమా ఇప్పుడు..
2 వారాలు పూర్తి అయ్యే టైంకి సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Subham Movie 14 Days Total WW Collections Report(est)
👉Nizam: 1.07Cr~
👉Total AP: 1.30Cr~
AP-TG Total:- 2.37CR~(4.90CR~ Gross)
👉KA+ROI+OS : 1.16CR****approx
Total WW Collections: 3.53CR(Gross – 7.40CR~)
ఓవరాల్ గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర వాల్యూ టార్గెట్ 2.8 కోట్ల దాకా ఉండగా సినిమా ఈ మార్క్ ని దాటేసి 2 వారాలు పూర్తి అయ్యే టైంకి ఓవరాల్ గా 73 లక్షల రేంజ్ లో మంచి లాభాన్ని సొంతం చేసుకుంది. ఇక ఈ వీక్ లో లిమిటెడ్ థియేటర్స్ లో రన్ అవుతున్న సినిమా లాభాలను మరికొంత పెంచుకునే అవకాశం ఉంది.