బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయిన రోజు లో బజ్ వలన అనుకున్న రేంజ్ లో ఇంపాక్ట్ చూపించ లేక పోయిన చియాన్ విక్రం(Chiyaan Vikram) నటించిన లేటెస్ట్ మూవీ వీర ధీర శూర(Veera Dheera Soora Part 2) సినిమా, మంచి టాక్ ఉన్నా మరోసారి విక్రమ్ కెరీర్ లో నిరాశ కలిగించే రిజల్ట్ ను సొంతం చేసుకునే…
అవకాశం ఉందని అనిపించగా తమిళ్ లో అలాగే ఓవర్సీస్ లో పాజిటివ్ టాక్ పవర్ హెల్ప్ తో 2 వారాల్లో అనుకున్న దానికన్నా బెటర్ రికవరీ సొంతం చేసుకుని కుమ్మేయడం విశేషం అని చెప్పాలి. 65 కోట్ల గ్రాస్ మార్క్ ని 2 వారాలలో క్రాస్ చేసి కుమ్మేసింది సినిమా..
మొత్తం మీద 14వ రోజున మరోసారి కోటి మార్క్ గ్రాస్ ను తమిళ్ లో అందుకున్న సినిమా వరల్డ్ వైడ్ గా 1.5 కోట్ల మార్క్ ని అందుకోగా రెస్ట్ ఆఫ్ ఇండియా మరియు కేరళ కలెక్షన్స్ అప్ డేట్ అవ్వగా టోటల్ 2 వీక్స్ బాక్స్ అఫీస్ కలెక్షన్స్ లెక్క ఈ విధంగా ఉంది…
Veera Dheera Soora Part2 14 Days Total WW Collections Report
👉Tamilnadu – 40.70Cr~
👉Telugu States- 2.70Cr~
👉KA+ROI – 5.25Cr(updated)
👉Overseas – 16.85CR ***Approx
Total WW Collections – 65.50CR~(31.75CR~ Share)
(88%~ Recovery)
ఇదీ 2 వారాల్లో సినిమా టోటల్ గా సాధించిన కలెక్షన్స్…
మొత్తం మీద 36 కోట్లకు పైగా వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా 2 వారాల్లో అనుకున్న 88% రికవరీని సాధించగా క్లీన్ హిట్ కోసం మరో 4.5 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సి ఉంటుంది. కానీ ఈ వీక్ లో అజిత్ మూవీ రిలీజ్ కావడంతో మరో 10 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సినిమా ఎంతవరకు అందుకుంటుందో చూడాలి.