బాక్స్ ఆఫీస్ దగ్గర నట సింహం నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) నటించిన లేటెస్ట్ మూవీ భగవంత్ కేసరి(Bhagavanth Kesari) సినిమా ఆడియన్స్ ముందుకు వచ్చి 2 వారాలను పూర్తి చేసుకోగా సినిమా మంచి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుని బాక్స్ ఆఫీస్ దగ్గర లాంగ్ రన్ ను…
సొంతం చేసుకుంటూ పరుగును కొనసాగిస్తూ ఉండగా ఓవరాల్ గా 2 వారాలు పూర్తి అయ్యే టైంకి సినిమా బ్రేక్ ఈవెన్ ని అందుకుంటుంది అనుకున్నా అలా జరగలేదు…ఎంత పాజిటివ్ టాక్ ఉన్నా కూడా దసరా టైం మరీ సంక్రాంతిలా లాంగ్ రన్స్ కష్టమే. అలాగే పోటిలో ఉన్న ఇతర సినిమాల ఎఫెక్ట్ కూడా ఇంపాక్ట్ చూపించి…
ఓవరాల్ గా 2 వారాల్లో 65.74 కోట్ల షేర్ ని అందుకున్న భగవంత్ కేసరి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్ ని అందుకోవాలి అంటే 68.50 కోట్ల దాకా షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉండగా 2 వారాల కలెక్షన్స్ కాకుండా సినిమా ఇంకా….
2.76 కోట్ల దాకా షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కొత్త సినిమాలు చిన్నవే అయినా వాటికోసం థియేటర్స్ ని కోల్పోవాల్సి వస్తుంది భగవంత్ కేసరి కూడా… ఉన్న థియేటర్స్ లో సినిమా స్టడీ కలెక్షన్స్ ని ఇలానే లిమిటెడ్ గానే అయినా సొంతం చేసుకుంటూ పరుగును కొనసాగిస్తే…
సినిమా బ్రేక్ ఈవెన్ ని పూర్తి చేసుకునే అవకాశం ఉంది, ఈ వీకెండ్ లో సినిమా శని ఆదివారాల్లో కనుక మంచి జోరుని చూపిస్తే బ్రేక్ ఈవెన్ కి ఎక్కువ అవకాశం ఉంటుంది అని చెప్పాలి. మరి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ వీకెండ్ లో ఎలాంటి కలెక్షన్స్ తో హోల్డ్ చేస్తుందో చూడాలి ఇక…