టాలీవుడ్ లో అడుగు పెట్టిన రెండో సినిమా తోనే సంచలనాలు సృష్టించిన హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఆ సినిమా తో 70 కోట్ల క్లబ్ టాలీవుడ్ లో మొదటి సారి ఓపెన్ అయింది. ఇక తర్వాత రామ్ చరణ్ చేసిన సినిమాలు అడపాదడపా విజయాలు సాధిస్తున్నా మళ్ళీ మగధీర లాంటి విజయం ఎదురు చూస్తున్న తరుణం లో రంగస్థలం తో ఆల్ టైం నాన్ బాహుబలి ఇండస్ట్రీ రికార్డ్ కొట్టాడు…
అలా తన ఖాతాలో మొదటి 100 కోట్ల సినిమా ను సొంతం చేసుకున్న రామ్ చరణ్ ఇప్పుడు నిర్మాత గా మారి కూడా 100 కోట్ల సినిమాలతో దుమ్ము లేపుతున్నాడు, రెండేళ్ళ క్రితం తన నిర్మాణం లో తొలి సారి నిర్మాణం అయిన మెగాస్టార్ చిరంజీవి కంబ్యాక్ మూవీ ఖైదీ నంబర్ 150 బాక్స్ ఆఫీస్ దగ్గర…
100 కోట్ల షేర్ మార్క్ ని అందుకుని మొదటి నాన్ బాహుబలి ఇండస్ట్రీ రికార్డ్ కొట్టింది. ఇక రీసెంట్ గా అత్యంత భారీ ఎత్తున 270 కోట్ల బడ్జెట్ తో రూపొందిన లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ సైరా నరసింహా రెడ్డి బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పటి వరకు ఏకంగా 125 కోట్ల రేంజ్ లో షేర్ ని వసూల్ చేసి…
రంగస్థలం పేరిట ఉన్న నాన్ బాహుబలి ఇండస్ట్రీ రికార్డ్ ను అడుగు దూరం లో బ్రేక్ చేయడానికి సిద్ధంగా ఉంది. ఈ సినిమా తో మూడో 100 కోట్ల సినిమా ను తన ఖాతాలో వేసుకున్నాడు రామ్ చరణ్. అటు హీరో గా 1 సినిమా లో నిర్మాతగా 2 సినిమాలతో 100 కోట్ల మార్క్ ని అందుకుని…
టాలీవుడ్ లో మొత్తంగా మూడు 100 కోట్ల సినిమాలను తన ఖాతాలో వేసుకుని సంచలనం సృష్టించాడు. బాహుబలి సిరీస్ అలాగే సాహో తో ప్రభాస్ ఖాతాలో మూడు 100 కోట్లు ఉండగా ఇప్పుడు రామ్ చరణ్ ఖాతాలో కూడా హీరో కం నిర్మాతగా మూడు 100 కోట్ల సినిమాలు ఉన్నట్లు అయింది. వచ్చే ఏడాది RRR మరో 100 కోట్ల సినిమాలో భాగం కాబోతున్నాడు రామ్ చరణ్.