బాక్స్ ఆఫీస్ దగ్గర రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన లేటెస్ట్ మూవీ ఆదిపురుష్(AdiPurush) మూవీ రీసెంట్ గా రిలీజ్ అయ్యి ఏ రేంజ్ లో ట్రోల్స్ ని ఫేస్ చేసుకుందో, ఏ రేంజ్ లో నెగిటివిటీని దక్కించుకుందో అందరికీ తెలిసిందే. మొదటి వీకెండ్ లో…
సెన్సేషనల్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న తర్వాత భారీగా డ్రాప్ అయిన సినిమా తర్వాత అనుకున్న రేంజ్ లో తేరుకోలేక పోయింది. దాంతో సినిమాకి తెలుగు వర్షన్ భారీకి అమ్మడంతో నష్టాలు భారీ లెవల్ లో ఉండే అవకాశం ఉండగా…
హిందీలో సినిమా మీద ఎన్ని ట్రోల్స్ వచ్చినా కూడా వాల్యూ బిజినెస్ కి చాలా దగ్గరగా సినిమా వెళ్ళింది అని చెప్పాలి. ఇక ఓవరాల్ గా చూసుకుంటే సినిమా ఇంకో 3.60 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుంటే సినిమా ఇన్ని ట్రోల్స్ నడుమ పరువు కాపాడుకునే అవకాశం ఉందని చెప్పాలి.
ఏ సినిమా అయినా కూడా బ్రేక్ ఈవెన్ టార్గెట్ లో 80-90% రికవరీ చేస్తే యావరేజ్ గా, 90-95% వరకు రికవరీ చేస్తే ఎబో యావరేజ్ గా 95-99% రేంజ్ లో రికవరీ చేస్తే సెమీ హిట్ గా నిలుస్తాయి… 100%-105% రేంజ్ రికవరీ తో హిట్ ఆ తర్వాత సూపర్ హిట్, బ్లాక్ బస్టర్ ఇలా సినిమాకి వచ్చే కలెక్షన్స్ తో ఏ రేంజ్ హిట్ అనేది తెలుస్తుంది…
ప్రస్తుతానికి ఆదిపురుష్ మూవీ 190 కోట్ల షేర్ మార్క్ ని అందుకోగా సినిమా 80% రేంజ్ లో రికవరీ అవ్వాలి అంటే సినిమా 193.6 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సి ఉంటుంది, ఈ లెక్కన సినిమా ఇంకో 3.60 కోట్ల షేర్ ని అందుకుంటే టోటల్ గా యావరేజ్ టాగ్ ని సొంతం చేసుకుని ఓవరాల్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాఫ్ కాకుండా యావరేజ్ రిజల్ట్ ను అందుకున్న సినిమాగా నిలుస్తుంది. మరి సినిమా టోటల్ రన్ లో ఈ మార్క్ ని అందుకుంటుందో లేదో చూడాలి.