బాక్స్ ఆఫీస్ దగ్గర చిన్న సినిమా 30 రోజుల్లో ప్రేమించడం ఎలా బాక్స్ ఆఫీస్ దగ్గర మొత్తం మీద మొదటి వీకెండ్ ని అల్టిమేట్ కలెక్షన్స్ తో ముగించింది. సినిమా తొలి రోజు కొంచం డివైడ్ టాక్ ని సొంతం చేసుకున్నా కానీ ఆడియన్స్ లో మాత్రం అల్టిమేట్ ట్రెండ్ ని దక్కించుకుని మొదటి వీకెండ్ ని సాలిడ్ కలెక్షన్స్ తో ముగించింది. సినిమా మూడో రోజు అంచనాలను అన్నీ మించేసి ఊచకోత కోసే కలెక్షన్స్ ని సాధించింది.
బాక్స్ ఆఫీస్ దగ్గర మూడో రోజు సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో 60-70 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంటుంది అని అంచనా వేయగా సినిమా ఆ అంచనాలను డబుల్ మార్జిన్ తో బ్రేక్ చేసి మెంటల్ మాస్ అనిపించే కలెక్షన్స్ ని రెండు తెలుగు రాష్ట్రాలలో సొంతం చేసుకుంది.
ఏకంగా 1.57 కోట్ల రేంజ్ లో షేర్ ని సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుని ట్రేడ్ మొత్తానికి భారీ షాక్ నే ఇచ్చింది. మూడో రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో సినిమా షేర్ ని గమనిస్తే…
👉Nizam: 48L
👉Ceeded: 36L
👉UA: 21L
👉East: 11L
👉West: 8L
👉Guntur: 11L
👉Krishna: 14L
👉Nellore: 8L
AP-TG Total:- 1.57CR (2.6Cr Gross~)
ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర టోటల్ వరల్డ్ వైడ్ గా 3 రోజులకు గాను టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన ఏరియాల వారి కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 1.45Cr
👉Ceeded: 77L
👉UA: 49L
👉East: 33L
👉West: 28L
👉Guntur: 38L
👉Krishna: 30L
👉Nellore: 22L
AP-TG Total:- 4.22CR (7Cr Gross~)
Ka+ ROI – 15L(Updated)
OS – 14L
Total WW: 4.51Cr(7.65Cr~ Gross)
ఇదీ సినిమా మొత్తం మీద వరల్డ్ వైడ్ గా సాధించిన సెన్సేషనల్ కలెక్షన్స్ లెక్కలు. మిక్సుడ్ టాక్ తోనే ఈ రేంజ్ లో కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా బిజినెస్ మార్క్ ని క్రాస్ చేసి మైనర్ ప్రాఫిట్ లను కూడా సొంతం చేసుకోవడం ఇక్కడ విశేషం గా చెప్పుకోవాలి.
ఇక సినిమా టోటల్ బిజినెస్ 4.4 కోట్లు కాగా సినిమా 4.8 కోట్ల రేంజ్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా 3 రోజుల్లోనే ఏకంగా 4.51 కోట్ల షేర్ ని సొంతం చేసుకోగా ఇప్పుడు మరో 29 లక్షల షేర్ ని అందుకుంటే బాక్స్ ఆఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్ అవుతుంది, అది 4 వ రోజు కలెక్షన్స్ తో క్రాస్ చేసి క్లీన్ హిట్ గా నిలవబోతుంది ఈ సినిమా…