30 కోట్లు+…కెరీర్ బెస్ట్ రికార్డ్!!

0
495

     నాగ చైతన్య కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ తో దుమ్ము లేపుతుంది మజిలీ సినిమా, బాక్స్ ఆఫీస్ దగ్గర తొలిరోజు 7.8 కోట్ల షేర్ ని రెండో రోజు 5.7 కోట్ల షేర్ ని అందుకున్న సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మూడో రోజు కూడా దుమ్ము లేపే రేంజ్ లో షేర్ ని వసూల్ చేసి సంచలనం సృష్టించిన మజిలీ సినిమా నాగ చైతన్య కెరీర్ లోనే ది బెస్ట్ ఓపెనింగ్స్ ని అందు కుంది.

కాగా సినిమా రెండు రోజుల్లో టోటల్ గా 21 కోట్లకి పైగా షేర్ ని అందుకోగా గ్రాస్ ని అందుకున్న సినిమా మూడో రోజు కూడా అద్బుతమైన కలెక్షన్స్ ని సాధించి హోల్డ్ చేసింది, సినిమా వీకెండ్ టోటల్ గ్రాస్ లెక్కలు మాత్రం నాగ చైతన్య లోనే సరికొత్త రికార్డ్ గా చెప్పుకోవాలి.

సినిమా ఓవరాల్ గా 30 కోట్లకు పైగా గ్రాస్ ని మూడు రోజుల్లోనే అందుకుందని సమాచారం, ఇక ఓవరాల్ గా షేర్ వివరాలు ఎలా ఉంటాయి అన్నది ఆసక్తి గా మారింది, మొత్తం మీద వరుస పరాజయాల నుండి నాగ చైతన్య సెన్సేషనల్ కంబ్యాక్ ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్నాడు.

కెరీర్ లో 2017 లో రారండోయ్ వేడుక చూద్దాం తో కెరీర్ బెస్ట్ ని సొంతం చేసుకున్న నాగ చైతన్య బాక్స్ ఆఫీస్ దగ్గర మళ్ళీ ఆ రేంజ్ లో దుమ్ము లేపలేదు, కానీ మజిలీ లాంటి తక్కువ కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న సినిమా తో సెన్సేషనల్ కలెక్షన్స్ ని అందుకున్న మజిలీ సినిమా.

లాంగ్ రన్ లో మరింత దూరం వెళ్ళే అవకాశం ఎంతైనా ఉంది, వర్కింగ్ డేస్ లో సినిమా ఏమాత్రం హోల్డ్ చేసినా లాంగ్ రన్ లో నాగ చైతన్య కెరీర్ బెస్ట్ రికార్డులతో సెన్సేషన్ ని క్రియేట్ చేయడం ఖాయమని చెప్పాలి. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here