బాక్స్ ఆఫీస్ దగ్గర పాన్ ఇండియా సెన్సేషన్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ రాధే శ్యామ్ సినిమా మొత్తం మీద వీకెండ్ తర్వాత స్లో అయింది, 4 వ రోజు ఊహించని రేంజ్ లో డ్రాప్స్ ను సొంతం చేసుకున్న సినిమా తీవ్రంగా నిరాశ పరిచింది అని చెప్పాలి. కానీ ఇదే టైం లో మొదటి వీకెండ్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు తెలుగు రాష్ట్రాలలో మొత్తం మీద మంచి వసూళ్ళ నే సొంతం….
చేసుకుని దుమ్ము లేపింది, సినిమా కి వచ్చిన టాక్ కి ఓవరాల్ గా తక్కువ థియేటర్స్ ఉన్నప్పటికీ కూడా ఓవరాల్ గా వీకెండ్ లో సాలిడ్ కలెక్షన్స్ నే సొంతం చేసుకుని ఈ సినిమా టాప్ 10 వీకెండ్ తెలుగు రాష్ట్రాల కలెక్షన్స్ పరంగా చోటు ని సొంతం చేసుకుంది ఈ సినిమా…
మొదటి వీకెండ్ లో సినిమా సాధించిన కలెక్షన్స్ అన్నీ అనుకున్నట్లు జరిగితే నాన్ బాహుబలి రికార్డులు క్రియేట్ చేయాల్సింది కానీ అలా జరగలేదు, అయినా కానీ ఓవరాల్ గా సినిమా మొదటి వీకెండ్ తెలుగు రాష్ట్రాల కలెక్షన్స్ 48.39 కోట్ల షేర్ తో సినిమా టాప్ 8 ప్లేస్ ను సొంతం చేసుకుంది…
మొత్తం మీద తెలుగు రాష్ట్రాలలో రిలీజ్ అయిన అన్ని మూవీస్ లో టాప్ 10 సినిమాలను గమనిస్తే…
👉#Baahubali2- 74.40Cr
👉#Saaho- 58.67C
👉#Syeraa- 55.82C
👉#VakeelSaab- 53.37Cr
👉#Bheemlanayak- 53.07Cr
👉#Pushpa- 52.98Cr
👉#SarileruNeekevvaru- 49.30Cr
👉#RadheShyam -48.39Cr***
👉#AlaVaikunthaPurramuloo- 47.39Cr
👉#AravindhaSametha- 41.80Cr
ఇవీ మొత్తం మీద ఓవరాల్ గా టాప్ 10 ప్లేసులలో నిలిచిన టోటల్ మూవీస్ లిస్టు….
బాహుబలి 2 మూవీ ఎవ్వరికీ అందనంత ఎత్తులో ఇప్పటికీ టాప్ లో దూసుకు పోతూ ఉండగా రాధే శ్యామ్ కి నాన్ బాహుబలి రికార్డ్ ను అందుకుంటుంది అనుకున్నా అనుకున్న రేంజ్ రిలీజ్ అండ్ టాక్ రాక పోవడం గట్టి ఎదురుదెబ్బ తీసింది. దాంతో టాప్ 8 ప్లేస్ తోనే సరిపెట్టుకుంది రాధే శ్యామ్. ఓవరాల్ గా ప్రభాస్ నటించిన మూడు సినిమాలు లిస్టులో ఉండటం విశేషం…