బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ వీకెండ్ లో ఆడియన్స్ ముందుకు వచ్చిన లేటెస్ట్ మూవీ హ్యాప్పీ బర్త్ డే కి టాక్ అనుకున్న రేంజ్ లో రాలేదు, దానికి తోడూ తెలుగు రాష్ట్రాల్లో హెవీ వర్షాల వలన సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అస్సలు తేరుకోలేక పోయింది. మొత్తం మీద సినిమా 2 రోజుల్లో అటూ ఇటూగా 70 లక్షల దాకా షేర్ ని అందుకోగా మూడో రోజు పెద్దగా ఏమి గ్రోత్ అయితే కనిపించలేదు…
మొత్తం మీద మూడో రోజు తెలుగు రాష్ట్రాల్లో 14 లక్షల షేర్ ని సొంతం చేసుకోగా వరల్డ్ వైడ్ గా 18 లక్షల షేర్ ని అందుకుంది. దాంతో మొత్తం మీద సినిమా 3 రోజుల వీకెండ్ లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 20L
👉Ceeded: 10L
👉Andhra: 30L
AP-TG Total:- 0.60CR(1.00CR~ Gross)
👉KA+ROI+OS: 0.28Cr
Total WW:- 0.88CR(1.60CR~ Gross)
సినిమా టోటల్ బిజినెస్ డీటైల్స్ ని క్లియర్ గా చెప్పలేదు కానీ వర్త్ బిజినెస్ అటూ ఇటూగా 1.6 కోట్ల దాకా ఉంటుందని అంచనా… దాంతో సినిమా హిట్ అవ్వాలి అంటే 1.8 కోట్లకు పైగా కలెక్షన్స్ ని అందుకోవాల్సి ఉంటుంది, సినిమా 3 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా హిట్ అవ్వాలి అంటే ఇంకా 92 లక్షల షేర్ ని అందుకోవాల్సి ఉంటుంది.