3 రోజుల్లో సగం ఔట్…ఎం కొట్టుడు సామి ఇది!!

1
1067

  సూపర్ స్టార్ మహేష్ బాబు లేటెస్ట్ మూవీ మహర్షి బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము లేపే కలెక్షన్స్ తో సెన్సేషన్ ని క్రియేట్ చేస్తూ దూసుకు పోతుంది, కాగా రిలీజ్ రోజున సినిమా కి కొందరు సోషల్ మీడియా లో అలాగే రివ్యూ ల రూపం లో నెగటివ్ టాక్ ని నెగటివ్ రివ్యూ లను ఇచ్చారు, కానీ మహేష్ బాబు 25 వ సినిమా మాత్రం అన్నింటిని తట్టుకుని బాక్స్ ఆఫీస్ ఊచకోత కొస్తుంది.

సినిమా 100 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ని సొంతం చేసుకోగా కేవలం 3 రోజుల్లోనే సగానికి పైగా టార్గెట్ ని కంప్లీట్ చేసిందని సమాచారం. మూడో రోజు సాలిడ్ కలెక్షన్స్ ని అందుకున్న సినిమా నాలుగో రోజు కూడా హాలిడే నే అవ్వడం తో మరింత జోరు చూపే అవకాశం ఉందని చెప్పాలి.

ఇక వర్కింగ్ డేస్ లో సినిమా హోల్డ్ ని బట్టి లాంగ్ రన్ లో ఎంత దూరం వెళుతుంది అన్నది క్లారిటీ గా తెలియనుంది. మొత్తం మీద మహేష్ బాబు బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము లేపే కలెక్షన్స్ తో సెన్సేషన్ ని క్రియేట్ చేస్తున్నాడు అని చెప్పాలి. అది కూడా నెగటివ్ రివ్యూ లతో కొట్టడం ఇక్కడ విశేషం అని చెప్పొచ్చు.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your name here
Please enter your comment!