ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన సినిమాలకు ఇతర రాష్ట్రాల్లో కూడా మంచి క్రేజ్ ఉన్న విషయం తెలిసిందే. తన సినిమాలను ఇతర భాషల్లో అప్పుడప్పుడు డబ్ చేసినా లేక డైరెక్ట్ గానే రిలీజ్ చేసినా కానీ రెస్పాన్స్ అయితే ఎప్పుడు కూడా సాలిడ్ గానే సొంతం అవుతూ వచ్చింది అని చెప్పాలి. అల వైకుంఠ పురంలో సినిమా డైరెక్ట్ తెలుగు వర్షన్ తోనే తమిళనాడులో సెన్సేషనల్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని…
అల్లు అర్జున్ కి అక్కడ ఓ మంచి మార్కెట్ ని క్రియేట్ చేసి పెట్టగా ప్రజెంట్ ఆడియన్స్ ముందుకు వచ్చిన లేటెస్ట్ మూవీ పుష్ప బ్యాగ్ డ్రాప్ మనకు మరీ మాస్, రా అండ్ రస్టిక్ అనిపించే విధంగా అనిపించినా కానీ అక్కడ ఇలాంటి సబ్జెక్ట్ లు కామనే…. ఈ అడ్వాంటేజ్…
ఇప్పుడు అక్కడ సినిమాకు ఓ రేంజ్ లో కలిసి వచ్చింది. సినిమాను అక్కడకు వెళ్లి మరీ అల్లు అర్జున్ కూడా బాగా ప్రమోట్ చేయగా సినిమా కి అక్కడ రెస్పాన్స్ కూడా ఇప్పుడు కలెక్షన్స్ పరంగా ఓ రేంజ్ లో దుమ్ము లేపే రేంజ్ లో వసూళ్ళని అక్కడ సొంతం చేసుకుంటూ దూసుకు పోతుంది…
సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు 3.65 కోట్ల గ్రాస్ ను, రెండో రోజు 3.25 కోట్ల గ్రాస్ ను అందుకోగా మూడో రోజు మొదటి రోజుని మించిపోయిన సినిమా 4.35 కోట్ల గ్రాస్ ను సొంతం చేసుకుని దుమ్ము దుమారం లేపింది అని చెప్పాలి. దాంతో మూడు రోజుల వసూళ్లు 11.25 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకోవడం ఇక్కడ విశేషం. సినిమాను అక్కడ 6 కోట్ల…
రేటు కి అమ్మగా 13 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా 3 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ తో ఆల్ మోస్ట్ బ్రేక్ ఈవెన్ కి దగ్గరగా రాగా ఈ రోజు లేదా రేపు సాధించే కలెక్షన్స్ తో తమిళ్ లో బ్రేక్ ఈవెన్ ని సినిమా పూర్తీ చేసుకోబోతుంది అని చెప్పాలి. ఇక సినిమా లాంగ్ రన్ లో ఇంకా ఎంత దూరం వెళుతుందో చూడాలి.