బాక్స్ ఆఫీస్ దగ్గర శ్రీ విష్ణు నటించిన లేటెస్ట్ మూవీ రాజ రాజ చోర రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమా మొదటి రోజు కలెక్షన్స్ పరంగా కొంచం స్లోగా మొదలు అయినా కానీ ఓవరాల్ గా రోజు ముగిసే సరికి డీసెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపింది. ఇక సినిమా రెండో రోజు నుండి గ్రోత్ ని చూపెట్టడం మొదలు పెట్టగా వీకెండ్ ని పెర్ఫెక్ట్ గా వాడుకోవడం స్టార్ట్ చేసిన ఈ సినిమా…
రెండో రోజు మొదటి రోజు కన్నా బెటర్ కలెక్షన్స్ ని సాధించగా తర్వాత మూడో రోజు మరింత జోరు చూపిన ఈ సినిమా రెండో రోజు కన్నా కూడా బెటర్ కలెక్షన్స్ ని సాధించింది. దాంతో మొత్తం మీద సినిమా మొదటి రోజు కన్నా రెండో రోజు మూడో రోజు కలెక్షన్స్…
ఎక్కువగా రావడం సినిమా పాజిటివ్ టాక్ పవర్ ఎలా ఉందో అందరికీ తెలిసేలా చేస్తుంది అని చెప్పాలి. బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా తెలుగు రాష్ట్రాలలో ఫస్ట్ డే 57 లక్షల షేర్ ని, రెండో రోజు 64 లక్షల దాకా షేర్ ని సాధించగా మూడో రోజు ఏకంగా 76 లక్షల షేర్ ని సాధించింది.
దాంతో మొత్తం మీద 3 రోజుల రెండు తెలుగు రాష్ట్రాల కలెక్షన్స్ ఇప్పుడు 1.97 కోట్ల షేర్ మార్క్ ని 3.3 కోట్లకు పైగా గ్రాస్ మార్క్ ని అందుకుంది. ఇక వరల్డ్ వైడ్ గా ఫస్ట్ డే 65 లక్షల షేర్ ని, రెండో రోజు 76 లక్షల షేర్ ని సొంతం చేసుకోగా మూడో రోజు 81 లక్షల దాకా షేర్ ని సొంతం చేసుకోగా టోటల్ గా 3 రోజుల్లో ఇప్పుడు వరల్డ్ వైడ్ గా…
2.22 కోట్ల షేర్ మార్క్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా 3.85 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకుంది. సినిమా ను థార్డ్ పార్టీ బయర్స్ తో ఓన్ రిలీజ్ చేయగా బిజినెస్ వర్త్ 2.2 కోట్ల రేంజ్ లో ఉంటుందట, ఆ లెక్కన 2.4 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గట్ కి సినిమా మరో 18 లక్షలు సాధిస్తే క్లీన్ హిట్ గా నిలుస్తుంది. 4 వ రోజు సినిమా సాధించే కలెక్షన్స్ తో కంప్లీట్ గా లాభాల భాట పట్టడం ఖాయమని చెప్పొచ్చు ఇక.