Home న్యూస్ 4.5 కోట్ల టార్గెట్….3 రోజుల్లో వచ్చింది ఇది!!

4.5 కోట్ల టార్గెట్….3 రోజుల్లో వచ్చింది ఇది!!

0

యంగ్ హీరో కార్తికేయ నటించిన లేటెస్ట్ మూవీ రాజా విక్రమార్క బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమా కి ఆడియన్స్ నుండి పర్వాలేదు అనిపించే రేంజ్ రెస్పాన్స్ వచ్చింది కానీ అన్ సీజన్ ఎఫెక్ట్ అండ్ కురుప్ డామినేషన్ వలన ఈ సినిమా కి మరీ అనుకున్న రేంజ్ కలెక్షన్స్ బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం అవ్వలేదు, కానీ ఉన్నంతలో డీసెంట్ గానే హోల్డ్ చేసిన ఈ సినిమా…

మొదటి వీకెండ్ లో పర్వాలేదు అనిపించే కలెక్షన్స్ ని సొంతం చేసుకోగా ఇంకా బెటర్ గా ఇప్పుడు వర్కింగ్ డేస్ లో హోల్డ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మొత్తం మీద మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో 62 లక్షల షేర్ ని వసూల్ చేసిన ఈ సినిమా..

రెండో రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర 40 లక్షల దాకా షేర్ ని సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఇక 2 రోజులలో టోటల్ వరల్డ్ వైడ్ గా 1.15 కోట్ల దాకా షేర్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా మూడో రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు రాష్ట్రాలలో 37 లక్షల దాకా షేర్ ని…

ఓవరాల్ గా సొంతం చేసుకుందని సమాచారం. ఇక వరల్డ్ వైడ్ గా మూడో రోజు 41 లక్షల దాకా షేర్ ని ఈ సినిమా సాధించిందని ట్రేడ్ వర్గాల సమచారం. దాంతో మొత్తం మీద మూడు రోజులు పూర్తీ అయ్యే టైం కి 1.39 కోట్ల షేర్ ని తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమా సొంతం చేసుకోగా వరల్డ్ వైడ్ గా 1.56 కోట్ల షేర్ ని ఈ సినిమా సొంతం చేసుకుంది.

గ్రాస్ 2.75 కోట్ల రేంజ్ లో ఉంటుందని సమచారం. ఇక సినిమాను మొత్తం మీద 4 కోట్ల దాకా రేటు కి అమ్మినట్లు సమాచారం. దాంతో 4.5 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా 1.56 కోట్లు రికవరీ చేయగా బ్రేక్ ఈవెన్ కోసం ఇంకా 2.94 కోట్ల దాకా కలెక్షన్స్ ని అందుకోవాల్సి ఉంటుంది. ఇక వర్కింగ్ డేస్ లో సినిమా ఎలా పెర్ఫార్మ్ చేస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here