బాక్స్ ఆఫీస్ దగ్గర మాస్ మహారాజ్ రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ రామారావ్ ఆన్ డ్యూటీ రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమా మొదటి రోజే డిసాస్టర్ టాక్ ని సొంతం చేసుకోగా ఓపెనింగ్స్ పర్వాలేదు అనిపించినా రెండో రోజు నుండి సినిమా మినిమమ్ ఇంపాక్ట్ ని కూడా చూపించ లేక పోయిన ఈ సినిమా పూర్తిగా నిరాశ పరిచింది అని చెప్పాలి బాక్స్ ఆఫీస్ దగ్గర…. మొత్తం మీద మూడో రోజు…
రెండు తెలుగు రాష్ట్రాలలో సినిమా 35-40 లక్షల రేంజ్ లో అయినా షేర్ ని సొంతం చేసుకుంటుంది అనుకున్నా కానీ మినిమమ్ హోల్డ్ ని కూడా చూపించ లేక పోయిన సినిమా కేవలం 37 లక్షల షేర్ తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇక సినిమా టోటల్…
వరల్డ్ వైడ్ గా కేవలం 42 లక్షల దాకా షేర్ ని అందుకుని సండే అడ్వాంటేజ్ ను ఏమాత్రం వాడుకోలేక పోయింది బాక్స్ ఆఫీస్ దగ్గర. ఇక మొత్తం మీద సినిమా మూడు రోజుల వీకెండ్ పూర్తీ అయ్యే టైం కి ఓవరాల్ గా సాధించిన కలెక్షన్స్ బిజినెస్ లో సగం కూడా అందుకునేలా లేక పోవడం విచారకరం….
ఇక టోటల్ గా సినిమా 3 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 1.21Cr
👉Ceeded: 64L
👉UA: 54L
👉East: 37L
👉West: 20L
👉Guntur: 31L
👉Krishna: 23L
👉Nellore: 15L
AP-TG Total:- 3.65CR(6.15Cr~ Gross)
👉KA+ ROI: 0.30Cr
👉OS: 43L
Total World Wide: 4.38CR(7.60CR~ Gross)
ఇవీ టోటల్ గా వీకెండ్ లో సినిమా కలెక్షన్స్ లెక్క…
మొత్తం మీద సినిమా బిజినెస్ రేంజ్ 17.20 కోట్ల రేంజ్ లో ఉండగా సినిమా 18 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా వీకెండ్ పూర్తీ అయ్యే టైం కి సాధించిన కలెక్షన్స్ కాకుండా సినిమా ఇంకా 13.62 కోట్ల షేర్ ని అందుకోవాల్సి ఉంటుంది. అది దాదాపు అసాధ్యం అని చెప్పాలి.