యూత్ స్టార్ నితిన్ కీర్తి సురేష్ ల కాంబినేషన్ లో వెంకీ అట్లూరి డైరెక్షన్ లో రూపొందిన లేటెస్ట్ మూవీ రంగ్ దే బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా రిలీజ్ అవ్వగా మొదటి వీకెండ్ ని ఇప్పుడు కంప్లీట్ చేసుకుంది. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రెండో రోజు మంచి కలెక్షన్స్ తో హోల్డ్ చేయగా మూడో రోజు కూడా రెండో రోజు కన్నా ఇంకా బెటర్ గా కలెక్షన్స్ ని ఈ సినిమా సొంతం చేసుకుంటుంది అనుకున్నా…
ఓవరాల్ గా మంచి కలెక్షన్స్ నే సొంతం చేసుకున్నా కానీ సినిమా ఓవరాల్ గా మరీ అంచనాలను మించే కలెక్షన్స్ అయితే సాధించలేదు. 3 కోట్ల రేంజ్ లో ఎక్స్ పెర్ట్ చేసినా కానీ సినిమా మొత్తం మీద 2.88 కోట్ల షేర్ ని మూడో రోజు సొంతం చేసుకుంది.
ఇక మూడు రోజుల్లో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు తెలుగు రాష్ట్రాలలో 10 కోట్ల షేర్ మార్క్ ని అధిగమించింది, ఓవర్సీస్ లో సినిమా బాగా పెర్ఫార్మ్ చేయడం సినిమా కి కలిసి వచ్చింది, దాంతో ఓవరాల్ వీకెండ్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ లెక్క 12 కోట్ల మార్క్ ని అందుకుంది.
మొత్తం మీద బాక్స్ ఆఫీస్ దగ్గర వరల్డ్ వైడ్ గా మూడు రోజుల్లో రంగ్ దే సినిమా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే
👉Nizam: 3.91Cr
👉Ceeded: 1.45Cr
👉UA: 1.32Cr
👉East: 85L
👉West: 54L
👉Guntur: 1.01Cr
👉Krishna: 53L
👉Nellore: 43L
AP-TG Total:- 10.04CR (15.81Cr~ Gross)
KA+ROI: 60L
OS – 1.50Cr ( Updated)
Total World wide : 12.14CR (21Cr~ Gross)
సినిమాను మొత్తం మీద 23.9 కోట్లకు అమ్మగా సినిమా 24.5 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగగా 3 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా మరో 12.36 కోట్ల షేర్ ని సొంతం చేసుకుంటే బ్రేక్ ఈవెన్ ని సాధిస్తుంది, అంటే ఇప్పటి నుండి సినిమా జోరు ఇంకా పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పొచ్చు.