నాచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ మూవీ శ్యామ్ సింగ రాయ్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి వీకెండ్ ని ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో ఇప్పుడు ముగించుకుంది. సినిమా పై ఆడియన్స్ లో మంచి అంచనాలే ఉన్నా రిలీజ్ మాత్రం చాలా లిమిటెడ్ గా సొంతం అవ్వడంతో సినిమా ఎలా పెర్ఫార్మ్ చేస్తుంది అన్నది ఆసక్తిగా మారగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఉన్న పరిస్థితులలో కూడా ఓపెనింగ్ డే…
నుండే మంచి వసూళ్ళని సొంతం చేసుకుంటూ పరుగును కొనసాగిస్తూ ఉండగా రెండు తెలుగు రాష్ట్రాలలో సినిమా 3 వ రోజు ఎక్స్ లెంట్ హోల్డ్ ని సొంతం చేసుకోగా మరీ అంచనాలను మించే రేంజ్ లో కాకున్నా కానీ ఉన్నంతలో సినిమా 3.52 కోట్ల షేర్ ని సొంతం చేసుకుంది.
సినిమా 2 వ రోజు 4.38 కోట్ల షేర్ ని అందుకోగా మూడో రోజు 3.5 కోట్ల నుండి 3.8 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ ని అందుకుంటుంది అనుకున్నా ఇక్కడ కొంచం తగ్గినా కానీ ఓవరాల్ గా బాగానే కలెక్షన్స్ ని సాధించింది. ఇక సినిమా టోటల్ గా 3 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 6.17Cr(inc GST)
👉Ceeded: 1.67Cr
👉UA: 1.41Cr
👉East: 60L
👉West: 50L
👉Guntur: 78L
👉Krishna: 56L
👉Nellore: 38L
AP-TG Total:- 12.07CR(20.45CR~ Gross)
Ka+ROI: 2.31Cr
OS – 2.85Cr
Total WW: 17.13CR(30.35CR~ Gross)
ఇదీ మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 3 రోజుల్లో వరల్డ్ వైడ్ గా సాధించిన బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ లెక్క..
సినిమా ఓవరాల్ బిజినెస్ లెక్క 22 కోట్ల రేంజ్ లో ఉండగా సినిమా 22.5 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటే బాక్స్ ఆఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్ ని సొంతం చేసుకునే చాన్స్ ఉండగా 3 రోజుల తర్వాత సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్ కోసం ఇంకా 5.27 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి…