బాక్స్ ఆఫీస్ దగ్గర సుధీర్ బాబు హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ శ్రీదేవి సోడా సెంటర్ సినిమా మొదటి రోజు నుండే కలెక్షన్స్ పరంగా కొంచం స్లో డౌన్ అయ్యి కలెక్షన్స్ ని సాధిస్తూ ఉండగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకోవాల్సిన టార్గెట్ ఎక్కువగా ఉండటం తో సినిమా కలెక్షన్స్ మాత్రం బిజినెస్ రేంజ్ లో అయితే లేవనే చెప్పాలి. రెండో రోజు రెట్టించిన జోరు చూపెట్టాల్సిన అవసరం ఉన్నప్పటికీ కూడా….
సినిమా కలెక్షన్స్ అంతంత మాత్రమె రాగా బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా మూడో రోజు కూడా డ్రాప్స్ ను సొంతం చేసుకుంటుంది అనుకున్నా కొంచం గ్రోత్ ని చూపెట్టి సండే అడ్వాంటేజ్ వలన మూడో రోజు రెండో రోజు కన్నా బెటర్ కలెక్షన్స్ ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంది..
సినిమా రెండో రోజు తెలుగు రాష్ట్రాలలో 77 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా మూడో రోజు 60 లక్షల రేంజ్ కలెక్షన్స్ ని అందుకునేలా కనిపించిన సినిమా రోజు ముగిసే సరికి కొంచం గ్రోత్ ని చూపెట్టి రెండో రోజు కన్నా ఎక్కువ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని 86 లక్షల మార్క్ ని అందుకుంది.
దాంతో ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా మొదటి వీకెండ్ లో టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ లెక్కలను గమనిస్తే…
👉Nizam: 1.09Cr
👉Ceeded: 51L
👉UA: 38L
👉East: 28L
👉West: 14L
👉Guntur: 31L
👉Krishna: 16L
👉Nellore: 8.3L
AP-TG Total:- 2.95CR(4.69Cr Gross)
KA+ROI: 7L
OS: 13L~
Total Collections: 3.15CR(5.14CR~ Gross)
సినిమాను మొత్తం మీద 8 కోట్ల రేంజ్ రేటు కి అమ్మగా 8.5 కోట్ల రేంజ్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా మొత్తం మీద వీకెండ్ సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇప్పుడు బ్రేక్ ఈవెన్ ని అందుకోవాలి అంటే మరో 5.35 కోట్ల రేంజ్ షేర్ ని ఇంకా సొంతం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా ఇక వర్కింగ్ డేస్ లో ఎలాంటి ప్రదర్శనని కనబరుస్తుందో చూడాలి.