బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా ఆడియన్స్ ముందుకు వచ్చిన సినిమాలు అన్నీ కూడా మరీ ఇదివరకు రిలీజ్ అయిన మూవీస్ రేంజ్ లో ఆదరణని సొంతం అయితే చేసుకోవడం లేదు, రీసెంట్ గా రంగ్ దే మరియు అరణ్య సినిమాలకు పోటిగా రిలీజ్ అయిన చిన్న సినిమా తెల్లవారితే గురువారం బాక్స్ ఆఫీస్ దగ్గర మినిమమ్ ఇంపాక్ట్ ని కూడా క్రియేట్ చేయలేక పోయింది. సినిమా ఓపెనింగ్స్ లో తీవ్ర నిరాశ ని మిగిలించింది.
సినిమా బిజినెస్ వివరాలు ఏవి ఇప్పటి వరకు బయటికి రాలేదు కానీ సినిమా మొత్తం మీద మూడు రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాలలో సొంతం చేసుకున్న టోటల్ కలెక్షన్స్ చిల్లర అనిపించే లెవల్ లో ఉండటం విచార కరం.. సినిమా మొత్తం మీద మొదటి రోజు 10 లక్షలు,
రెండో రోజు 6 లక్షలు, మూడో రోజు 3 లక్షల రేంజ్ లో కలెక్షన్స్ ని సొంతం చేసుకోగా మొత్తం మీద మూడు రోజుల్లో బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా 19 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకున్నట్లు ట్రేడ్ వర్గాలు తెలియజేస్తున్నాయి. అవి కూడా సినిమా కి మొదటి రోజు నుండే…
వచ్చిన డెఫిసిట్ లు, నెగటివ్ షేర్ లు కూడా కలిపి చెబుతున్న లెక్క అని, అవి కూడా తీసేస్తే సినిమా పట్టుమని 6-8 లక్షల రేంజ్ షేర్ ని కూడా టచ్ చేయదని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ రేంజ్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర నిరాశ పరిచిన ఈ సినిమా ఓవరాల్ గా ఆడియన్స్ ను మెప్పించడం లో తీవ్రంగా విఫలం అయింది అని చెప్పాలి.
ప్రమోషన్స్ లాంటివి రిలీజ్ కి ముందు బాగానే చేసినా రిలీజ్ అయ్యాక అసలు పట్టించుకోలేదు, సినిమా చాలా వరకు ఆడియన్స్ కి అసలు రిలీజ్ అయినట్లే తెలియదు అని చెప్పాలి. మొత్తం మీద బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా ఇప్పుడు భారీ డిసాస్టర్ గా పరుగును ముగించే అవకాశం ఎక్కువగా ఉందని చెప్పాలి.